- Telugu News Photo Gallery Ayurvedic tips for Eye sight: To Improve Eyesight Should Try These 5 Ayurvedic Remedies
Ayurvedic Tips for Eye Sight: కంటి చూపుకు పదును పెట్టే 5 ఆయుర్వేధ పద్ధతులు.. వీటిని ఎలా చేయాలంటే..
కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. చూపు పోతే ఈ లోకం అంధకారం అవుతుంది. అందుకే ఈ అవయవాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నేటి మొబైల్-ల్యాప్‌టాప్ యుగంలో.. మన కళ్ళు రోజులో ఎక్కువ భాగం ఈ పరికరాలకు అతుక్కుపోతున్నాయి. ఈ అలవాటు కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వివిధ శారీరక సమస్యలు, అలెర్జీలు వంటి ప్రమాదాలు వస్తాయి. వీటన్నింటి నుంచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి..
Updated on: Mar 25, 2024 | 12:49 PM

కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. చూపు పోతే ఈ లోకం అంధకారం అవుతుంది. అందుకే ఈ అవయవాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ నేటి మొబైల్-ల్యాప్‌టాప్ యుగంలో.. మన కళ్ళు రోజులో ఎక్కువ భాగం ఈ పరికరాలకు అతుక్కుపోతున్నాయి. ఈ అలవాటు కళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాకుండా వివిధ శారీరక సమస్యలు, అలెర్జీలు వంటి ప్రమాదాలు వస్తాయి. వీటన్నింటి నుంచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, దృష్టిని కాపాడుకోవడంపై శ్రద్ధ అవసరం. ఈ కింది ఇంటి నివారణలు, ఆయుర్వేద పద్ధతులతో మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోండి. నేత్ర ఆయుర్వేద నేత్ర స్పెషాలిటీ క్లినిక్ వైద్యులు సూచిస్తున్న ఆయుర్వేద మార్గాలు ఇవే..

సాధారణంగా ఇతర భాగాలకంటే కళ్లు చాలా సున్నితమైనవి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. అంజనా (కొల్లారియం) ను నాసికా రంధ్రాల ద్వారా ఔషధాన్ని తీసుకోవాలి. ఇది కళ్ళను రక్షించడానికి, కఫాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది.

కంటి చూపును మెరుగుపరచడానికి ఫుట్ మసాజ్ బాగా పనిచేస్తుంది. ఆయుర్వేద భాషలో దీనిని పాదభంగ అంటారు.

మంచి కంటి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం. విటమిన్లు ఎ, సి, ఇ, బి మంచి కంటి చూపును నిర్వహించడానికి సహాయపడతాయి. మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆహారాలను తినాలి.

గతంలో కంటి చూపును మెరుగుపరచడానికి త్రిఫల ఉపయోగించేవారు. వివిధ కంటి సమస్యలను పరిష్కరించడంలో త్రిఫల అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే త్రాటక్ అనే ఒక రకమైన ఆయుర్వేద అభ్యాసం కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది కంటి చూపును పదును పెట్టడానికి ఉపయోగపడుతుంది. నెయ్యి దీపం వెలిగించి, కొంత దూరం నుంచి ఒక దిశలో దీప జ్వాల వైపు చూడాలి. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మీ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.




