- Telugu News Photo Gallery Are you unable to do anything because of sleep deprivation? This could be the reason
నిద్ర మత్తు వల్ల ఏమి చేయలేక పోతున్నారా.? రిజన్ ఇదే కావచ్చు..
ఆరోగ్యంగా ఉండటానికి శరీరంలో అవసరమైన అన్ని విటమిన్లు సరైన పరిమాణంలో ఉండటం చాలా ముఖ్యం. ఈ విటమిన్ల లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. విటమిన్లు లేకపోవడం వల్ల కలిగే సమస్యల్లో ఒకటి నిద్ర సమస్య కూడా. రోజంతా నిద్రమత్తుగా ఉండటం కూడా విటమిన్ లోపమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, ఇందుకు కారణమైన విటమిన్ ఏంటి..? దాని గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Nov 04, 2025 | 12:16 PM

మీరు రోజంతా హెల్దీగా ఉండాలంటే, అన్ని రకాల విటమిన్లతో పాటుగా మీ శరీరంలో విటమిన్ బి12 కూడా సరైన మోతాదులో ఉండాలి. బీ12 అనేది అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకం. శరీరంలోని వివిధ అవయవాల పనితీరుపై ఇది ప్రభావం చూపిస్తుంది.

ముఖ్యంగా శరీరంలో బీ 12 విటమిన్ లోపం ఉంటే మీకు రోజంతా నిద్రమత్తుగా ఉంటుంది. మీరు ఎక్కువ గంటలు నిద్రపోయిన తర్వాత కూడా ఇంకా మబ్బుగా, అలసటగా అనిపించటం, ఏ పనిచేయాలన్నా బలం కూడగట్టుకోలేకపోతే దీనికి కారణం శరీరంలో విటమిన్ బి12 లోపంగానే గుర్తించాలంటున్నారు నిపుణులు.

అంతేకాదు.. విటమిన్ బీ12 లోపం వల్ల మూడ్ స్వీగ్స్ ఎదుర్కొంటారు. దాంతో పాటుగా జ్ఞాపకశక్తి సమస్యలు కూడా వేధిస్తాయి. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో పదే పదే వెతుక్కోవాల్సి వస్తుంది. అలాగే, ఎప్పుడూ తూలి పడిపోతున్నట్టుగా ఉంటుంది. ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోవటం కూడా అది విటమిన్ బీ12 లోపంగా గమనించాలి.

అలసట, రాత్రుళ్లు అధిక చెమట కూడా విటమిన్ బీ 12 లోపం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. విటమిన్ బీ12 లోపం ఉంటే మీ కండరాలు బలహీనంగా మారుతాయి. అలాగే, మీరు గతంలో ఉన్నంత హుషారుగా లేకపోతే, మీకు ఆత్మ విశ్వాసం తగ్గినట్టు అనిపిస్తే, నిరాశ, నిస్సహాయత అనిపిస్తే విటమిన్ బీ12 లోపం ఉన్నట్టుగా గమనించాలి.

అయితే, శరీరం తనంతట తాను బీ12 ఉత్పత్తి చేయలేదు. అందువల్ల ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా జంతు ఉత్పత్తుల్లోనే లభిస్తుంది. పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లలో విటమిన్ బీ 12 లభిస్తుంది. వెజిటేరియన్లు, వేగన్స్ అయితే సప్లిమెంట్ల ద్వారా గానీ, విటమిన్ బీ 12 కలిపిన బలవర్థక ఆహారం ద్వారా ఇది లభిస్తుంది. ఈ బీ 12 విటమిన్ కాలేయంలో ఐదేళ్లపాటు నిల్వ ఉంటుంది. ఈ నిల్వ తగ్గినప్పుడు విటమిన్ లోపం ఏర్పడుతుంది.




