- Telugu News Photo Gallery Are you suffering from a sore throat? These tips will provide quick relief
Sore Throat: గొంతునొప్పి వేధిస్తోందా.? ఈ చిట్కాలతో త్వరిత ఉపశమనం..
చాలామంది గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతున్నారు. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతోనే గొంతు నొప్పికి చెక్ పెట్టొచ్చు. ఫ్లూ లేదా ఇతర సమస్యలు కూడా గొంతునొప్పికి కారణం అవుతుంటాయి. యాసిడ్ రిఫ్లక్స్, కడుపుబ్బరం, బి-కాంప్లెక్స్ లోపం, విటమిన్స్ లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం, ఐరన్ లోపం కూడా గొంతు నొప్పికి కారణం కావచ్చు.
Updated on: Jul 09, 2025 | 5:55 PM

గొంతు నొప్పిని నివారించడానికి తేనె దివ్య ఔషదంగా పని చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు చికాకునూ తగ్గిస్తుంది. ఒక చెంచా అల్లం రసంలో ఒక చెంచా తేనె బాగా కలిపి తీసుకున్నట్లయితే గొంతు నొప్పి త్వరగా తగ్గిపోతుంది. శ్వాసనాళాలలో పేరుకుపోయిన శ్లేష్మం కూడా కరిగిపోతుంది.

గోరువెచ్చని నీళ్లలో రాళ్ల ఉప్పువేసి పుక్కిలించినా శ్లేష్మం కరిగిపోతుంది. గొంతు నొప్పికి కారణం అయిన బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దీనివల్ల గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు.

గొంతు నొప్పితో బాధపడేవారు రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగితే ప్రయోజనం ఉంటుంది. చామంతి టీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వేడినీళ్లలో చామంతి ఆకులు వేసి.. ఆవిరి పీల్చినా గొంతు నొప్పి, జలుబు లక్షణాలు త్వరగా తగ్గుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఒక కప్పు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని గంటకు ఒకసారి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. అయితే ఇది మోతాదులో మాత్రమే వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ అధిక వినియోగం అనేక సమస్యలకు కారణం.

వెల్లుల్లి రెబ్బను నోట్లో పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నములుతూ రసాన్ని మింగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గిపోతుంది. కప్పు నీటిలో అరచెంచా మిరియాలపొడి వేసి మరిగించిన నీటిలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది.




