- Telugu News Photo Gallery Are you having trouble with oily skin? follow these tips, check here is details in Telugu
Oily Skin Tips: ఆయిలీ స్కిన్‌తో ఇబ్బందిగా ఉంటోందా.. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది!
ఆయిల్ స్కిన్ ఉన్నవారు నిజంగానే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ సమ్మర్‌లో అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయిలీ స్కిన్‌తో ఉన్నవారు ఏ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, లోషన్స్ ఏమి ఉపయోగించినా జిడ్డు కారిపోతుంది. కానీ మాయిశ్చ రైజర్స్ రాయక తప్పదు. ముఖానికి మాయిశ్చరైజర్ అప్లూ చేయకపోతే చర్మం హైడ్రేషన్ కోసం మరింత ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం మరింత జిడ్డుగా, నల్లగా కనిపిస్తుందని చర్మ సంరక్షణ..
Updated on: Jan 28, 2024 | 11:14 AM

ఆయిల్ స్కిన్ ఉన్నవారు నిజంగానే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులోనూ సమ్మర్‌లో అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయిలీ స్కిన్‌తో ఉన్నవారు ఏ క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, లోషన్స్ ఏమి ఉపయోగించినా జిడ్డు కారిపోతుంది. కానీ మాయిశ్చ రైజర్స్ రాయక తప్పదు.

ముఖానికి మాయిశ్చరైజర్ అప్లూ చేయకపోతే చర్మం హైడ్రేషన్ కోసం మరింత ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో చర్మం మరింత జిడ్డుగా, నల్లగా కనిపిస్తుందని చర్మ సంరక్షణ నిపుణులు అంటున్నారు.

చర్మానికి మాయిశ్చ రైజర్ అప్లై చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. దీంతో చర్మం నేచురల్‌గానే మెరుస్తుంది. మీ చర్మం ఎలా ఉన్నా మాయిశ్చ రైజర్ అనేది ఖచ్చితంగా రాయాలి. చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయకపోతే.. తేమ కోల్పోయి.. పొడిబారిపోయి నిర్జీవంగా ఉంటుంది..

మీది ఆయిలీ స్కిన్ అయితే.. జెల్ వంటి ఉత్పత్తులు ఉపయోగించడం ఉత్తమం. జిడ్డు చర్మం ఉన్నవారు రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్లు యూజ్ చేయడం బెటర్ అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఉదయానికి జిడ్డుతనం తగ్గుతుంది.

సాధారణంగా కఫ దోషం వల్ల కూడా చర్మం జిడ్డుగా మారుతుందని ఆయుర్వేదం అంటోంది. కాబట్టి అది చెక్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ ఉన్నవారు ప్రత్యేక మాయిశ్చ రైజర్లు, కాస్మెటిక్స్ వాడటం ఉత్తమం. అవసరం అనుకుంటే చర్మ నిపుణులను సంప్రదించడం మేలు.




