అమ్మయిలూ.. ఈ ఫేక్ ప్యాక్ ట్రై చెయ్యండి.. అందమే మిమ్మల్ని చూసి అసూయపడుతుంది..
యాపిల్స్ చాలామంది ఇష్టంగా తింటారు. పోషకాలు అధికంగా ఉండే యాపిల్స్ ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం అందరికీ తెలసిందే. రోజు యాపిల్ తింటే డాక్టర్‌తో పనిలేదు అంటారు. అసలు విశేషమేమిటంటే చర్మ సంరక్షణలో యాపిల్ కూడా ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. దీని సహాయంతో తయారు చేసిన ఫేస్ ప్యాక్స్ అందాన్ని రెట్టింపు చేయడంలో సహాయపడతాయి. అవేంటో తెలుసుకోండి..
Updated on: Aug 04, 2025 | 3:21 PM

మొటిమలు: ముఖంపై వచ్చే మొటిమలను తొలగించేందుకు యాపిల్ - తేనె కలిపిన ఫేస్ ప్యాక్ మంచిగా పనిచేస్తుంది. దీనికోసం యాపిల్ జ్యూస్ తీసుకుని అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి చర్మంపై అప్లై చేయాలి. కొంత సమయం తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాంటీ ఏజింగ్: ఈ రోజుల్లో చాలా మంది ముఖంపై అకాల ముడతలు లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. యాపిల్‌లో ఉండే యాంటీ ఏజింగ్ లక్షణాల ద్వారా వీటిని తగ్గించుకోవచ్చు. ఆపిల్ పేస్ట్‌లో దానిమ్మ రసాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని వారాల్లో తేడాను గమనించవచ్చు.

పొడి చర్మం: వేసవిలో పొడి చర్మం సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి ఒక గిన్నెలో తురిమిన యాపిల్ తీసుకుని అందులో ఒక చెంచా గ్లిజరిన్ - రోజ్ వాటర్ వేసి కలపాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసిన తర్వాత కొంతసేపు ఉంచి నీటితో శుభ్రంచేసుకోవాలి.

సాధారణ చర్మం: చర్మ సంరక్షణలో ఆపిల్ కూడా ఉత్తమమైనది. దీని ఫేస్ ప్యాక్ కోసం ఒక గుడ్డులోని తెల్లసొనను తీసుకుని దానికి ఒక చెంచా పెరుగు - ఒక చెంచా గ్లిజరిన్ వేయాలి. అందులో రెండు చెంచాల తురిమిన యాపిల్ జ్యూస్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి గంటపాటు ఉంచి శుభ్రం చేసుకోవాలి.

మృదువు చర్మం: మీ చర్మం మృదువుగా ఉంటే ఒక యాపిల్‌ను ఉడకబెట్టి దాని పేస్ట్‌ను ఒక గిన్నెలో వేయాలి. అందులో సగం అరటిపండు వేసి మెత్తగా చేయాలి. ఇప్పుడు దానికి ఒక చెంచా క్రీం వేసి కలిపి ముఖానికి అప్లై చేసి గంటపాటు అలాగే ఉంచాలి. చల్లటి నీటితో తొలగించిన తర్వాత మీ ముఖంపై తేడాను గమనించవచ్చు.




