- Telugu News Photo Gallery A photography exhibition initiative by Youth4jobs celebrating the creative abilities of the differently abled at state art gallery Hyderabad
Photography Challenge: దివ్యాంగుల ప్రతిభను వెలికి తీసేలా.. హైదరాబాద్‌లో ఫొటో ఎగ్జిబిషన్ ఫెస్టివల్
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డిసెంబర్ 9న గ్లోబల్ ఎబిలిటీ ఫోటోగ్రఫీ ఛాలెంజ్ 2022 ఫొటోఎగ్జిబిషన్ జరగనుంది. Youth4Jobs, ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ సంయుక్తంగా ఈ ఫొటోగ్రఫీ ఛాలెంజ్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.
Updated on: Dec 01, 2022 | 8:43 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో డిసెంబర్ 9న గ్లోబల్ ఎబిలిటీ ఫోటోగ్రఫీ ఛాలెంజ్ 2022 ఫొటోఎగ్జిబిషన్ జరగనుంది. Youth4Jobs, ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ సంయుక్తంగా ఈ ఫొటోగ్రఫీ ఛాలెంజ్ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నారు.

ఈ ఛాలెంజ్‌లో భాగంగా దేశం నలుమూలల నుంచి 134 ఫొటో ఎంట్రీలు వచ్చాయి. ఇందులో నుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ ఫొటోలను ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 2022లో ప్రదర్శనగా ఉంచనున్నారు.

విశిష్ట అతిథులు, ప్రముఖుల సమక్షంలో ఫొటోగ్రఫీ ఛాలెంజ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. సామాన్యులను కూడా ఈ ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌కు ఆహ్వానించనున్నారు.

గత పదేళ్లలో Youth4Jobs ఫౌండేషన్ (www.youth4jobs.org) వివిధ పోటీలు, కార్యక్రమాల ద్వారా దివ్యాంగుల ప్రతిభను వెలుగులోకి తెస్తోంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో ఫొటో ఛాలెంజ్‌ను ఏర్పాటుచేసింది.

ఫొటీల్లో భాగంగా దివ్యాంగ ఫొటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన చిత్రాలను ఫొటో ఫెస్టివల్‌కు ఆహ్వానించారు. వీటినుంచి ఎంపిక చేసిన అత్యుత్తమ ఫొటోలనే మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనగా ఉంచారు.





























