Pamela Anderson Marries Again: తన 53వ ఏట బాడీగార్డ్ ను ఆరో పెళ్లి చేసుకున్న హాలీవుడ్ నటి పమేలా
ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ తన 53 వ ఏట తాజాగా ఆరో పెళ్లి చేసుకుంది. తన బాడీగార్డ్ డాన్ హేరస్ట్ ను పెళ్లి చేసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ జంట గత ఏడాది క్రిస్మస్ రోజున వివాహం చేసుకున్నారని పలు కథనాలు.../

Pamela Anderson Marries Again: ప్రముఖ హాలీవుడ్ నటి పమేలా అండర్సన్ తన 53 వ ఏట తాజాగా ఆరో పెళ్లి చేసుకుంది. తన బాడీగార్డ్ డాన్ హేరస్ట్ ను పెళ్లి చేసుకున్నానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ జంట గత ఏడాది క్రిస్మస్ రోజున వివాహం చేసుకున్నారని పలు కథనాలు వినిపించాయి. తాజాగా తాను డాన్ ను పెళ్లి చేసుకున్నానని.. అభిమానులకు తెలియజేస్తూ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది
పమేలా మొదటిసారిగా 1995 లో టామీలీని పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. 1998 లో టామీ నుంచి విడాకులు తీసుకుంది.. అనంతరం 2006లో సింగర్ కిడ్ రాక్ ను పమేలా రెండో సారి వివాహం చేసుకుంది. ఈ దంపతులిద్దరూ కాపురం ఒకఏడాది మాత్రమే సాగింది.
ఇక 2007లో ముచ్చటగా మూడోసారి రిక్ సాల్మన్‌ను పమేలా పెళ్లి చేసుకుని.. అతనికి కూడా ఒక సంవత్సరానికి విడాకులు ఇచ్చేసింది. మళ్ళీ మనసులు కలిశాయంటూ 2014లో రిక్ సాల్మన్ పమేలా మరోసారి పెళ్లి చేసుకున్నారు.. అనంతరం ఒక ఏడాదిలోనే తూచ్ అంటూ విడాకులు ఇచ్చేసుకున్నారు ఇద్దరూ.. తర్వాత 2020లో ప్రముఖ హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను వివాహం చేసుకుని 12 రోజులకే అతనితో విడాకులు తీసుకుంది. తాజాగా పమేలా అండర్సన్ బాడీగార్డ్ ఐన డాన్ ను పెళ్లి చేసుకుని.. వెడ్డింగ్ ఫ్రాక్‌లో ఉన్న పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. తమ వివాహన్ని అధికారికంగా ప్రకటించింది. అయితే తన మనసు, మెదడు పై సోషల్ మీడియా ప్రభావం అధికంగా చూపిస్తుంది కనుక సోషల్ మీడియాకు గుడ్ బై చెబుతానని ఇటీవలే పమేలా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: జింకలు కొత్త కారుతో ఢీ కొట్టిన వ్యక్తి… రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు ఎలాగో తెలుసా..!