Prices of essential items : ‘ఏం… తినేనట్టులేదు.. ఏం.. కొనేటట్టులేదు..’ నిత్యావసరాల ధరలు ఆకాశానికి.. విలవిల్లాడిపోతోన్న జనం

|

May 19, 2021 | 5:17 PM

Essentials go up : కరోనా లాక్ డౌన్ల పుణ్యమాని అసలే చేతిలో చిల్లి గవ్వకూడా లేని పరిస్థితులు ఒకవైపు బ్రతుకులు భారం చేస్తుంటే,..

Prices of essential items : ఏం... తినేనట్టులేదు.. ఏం.. కొనేటట్టులేదు.. నిత్యావసరాల ధరలు ఆకాశానికి.. విలవిల్లాడిపోతోన్న జనం
Prices High
Follow us on

Essentials go up : కరోనా లాక్ డౌన్ల పుణ్యమాని అసలే చేతిలో చిల్లి గవ్వకూడా లేని పరిస్థితులు ఒకవైపు బ్రతుకులు భారం చేస్తుంటే, మరోవైపు వంటింట్లో నిత్యావసర వస్తువులైన నూనెలు సహా అన్నింటి ధరలు కూడా పెరిగిపోవడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. వేరుశెనగ, పొద్దుతిరుగుడు, పామాయిల్‌తో సహా అన్ని నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. మరోవైపు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను కేంద్రం పెంచుకుంటూపోతోంది. ఈ ధరల తాకిడికి పేద, మధ్య తరగతి ప్రజలు మరింత చితికిపోతున్నారు. ఇటీవల కాలంలో పెరిగిపోయిన నిత్యావసరాల ధరలను ఒక సారి పరికిస్తే..

2020లో మొత్తంగా 70 శాతం నూనెల ధరలు పెరిగిపోయాయి. 2020 మార్చి నెలకు(లాక్ డౌన్) ముందు ధరలు :

ప్రీడం రిఫైన్డ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.105
వేరుశనగ ఆయిల్ రిటైల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.110

2020 లాక్ డౌన్ సమయంలో :

సన్ ఫ్లవర్ ఆయిల్ రిటైల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.120
వేరుశనగ ఆయిల్ రిటైల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.125

లాక్ డౌన్ తర్వాత ప్రతి నెల పెరుగుతున్న ధరలు :

గత ఏడాది దసరా పండుగ(ఆక్టోబర్) సమయంలో.. సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె ల ధర లీటర్ కు రూ.130
2021 జనవరిలో సంక్రాంతి నాటికి సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె ల ధర లీటర్ కు రూ.150
2021 మే లాక్ డౌన్ కాలంలో సన్ ఫ్లవర్, వేరుశనగ నూనెల ధర లీటర్ కు రూ.180

సాధారణంగా సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె ధరల మధ్య వ్యత్యాసం రూ. 10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. తాజా లాక్ డౌన్ కాలంలో ఈ వ్యత్యాసం లేకుండా సమానంగా సన్ ఫ్లవర్, వేరుశనగ నూనెల ధరలు చేరిపోయాయి.

పామాయిల్ నూనెదీ అదే తీరు..

2020 ఆగస్టులో పామాయిల్ లీటర్ ధర రూ.84
2021 జనవరిలో పామాయిల్ లీటర్ ధర రూ.105
2021 మే(లాక్ డౌన్) పామాయిల్ లీటర్ ధర రూ.135

రైస్ బ్రాన్ ధరలు :

2020 ఆగస్టులో రైస్ బ్రాన్ లీటర్ ధర రూ.92
2021 జనవరిలో రైస్ బ్రాన్ లీటర్ ధర రూ. 111
2021 మే(లాక్ డౌన్) రైస్ బ్రాన్ లీటర్ ధర రూ.145

టీ పొడి ధరలు :

2020 లాక్ డౌన్ కు ముందు బ్రాండెడ్ టీ పొడి కిలో ప్యాక్ ధర.. రూ. 300 నుంచి రూ. 310
2021 లాక్ డౌన్ కాలంలో ఈ ధర రూ.410 నుంచి రూ.420

రూ.5 నుంచి రూ.10కి పెరిగిన అన్ని రకాల నిత్యావసర సరకుల ధరలు :

2021 జనవరిలో అంతకు ముందు ధరలతో పోల్చితే.. కిలోకు రూ.10 పెరిగిన అన్ని పప్పు దినుసుల ధరలు :

తాజా లాక్ డౌన్ కాలంలో వీటి ధరలు (కిలోకు) ఇలా…

ఎ గ్రేడ్ కందిపప్పు రూ.120
పెసర పప్పు రూ.110
మినప పప్పు రూ.130
శనగ పప్పు రూ.90
పల్లీలు రూ.120
కారం రూ.220- రూ.250.

వింటేనే కంగారు పెట్టిస్తోన్న ధరలతో కొనాలంటే సామాన్యుడు వేయి సార్లు ఆలోచించాల్సిన పరిస్జితులు ప్రస్తుతం దాపురించాయి.

Read also : Black Fungus : బ్లాక్ ఫంగస్ లక్షణాలేంటి.. ఎవరెవరికి.. ఎక్కడెక్కడ వ్యాపిస్తుంది..? పూర్తి వివరాలు అందించిన స్టేట్ నోడల్ ఆఫీసర్