YS Sharmila: అన్న ఆశీర్వదిస్తారా ! ఆగ్రహిస్తారా ! షర్మిల పుట్టింటి ఆశీస్సులు తీసుకు వస్తారా? ఇడుపులపాయలో ఏం జరగబోతోంది?

YS Sharmila: అన్న ఆశీర్వదిస్తారా ! ఆగ్రహిస్తారా ! షర్మిల 8వ తేదీన పుట్టింటి ఆశీస్సులు తీసుకు వస్తారా ? ఇడుపులపాయలో ఏం  జరగబోతోంది..??

YS Sharmila: అన్న ఆశీర్వదిస్తారా ! ఆగ్రహిస్తారా ! షర్మిల పుట్టింటి ఆశీస్సులు తీసుకు వస్తారా? ఇడుపులపాయలో ఏం జరగబోతోంది?
Ys Sharmila

Updated on: Jul 02, 2021 | 10:07 PM

(శ్రావణి – టీవీ9 తెలుగు-రిపోర్టర్)

YS Sharmila: అన్న ఆశీర్వదిస్తారా ! ఆగ్రహిస్తారా ! షర్మిల 8వ తేదీన పుట్టింటి ఆశీస్సులు తీసుకు వస్తారా ? ఇడుపులపాయలో ఏం  జరగబోతోంది..?? అసలు .., అన్నా చెల్లెలు కలుసుకుంటారా ? వైఎస్సార్ కి కలిసే నివాళులు అర్పిస్తారా ?  పురుడు పోసుకోబోతున్న కొత్త పార్టీ పై ఇడుపులపాయలో ఏం జరగబోతోంది..ఇప్పుడు వైఎస్సార్సీపీ, వైఎస్సార్టీపీ  నేతల్లో కార్యకర్తల్లో ఇవే సవాలక్ష ప్రశ్నలు.

జులై 8న వైఎస్సార్ జయంతి  రోజున ఇడుపులపాయలో ప్రతిరోజూ కుటుంబం అంతా కలిసి ఆయనకు  నివాళి అర్పించేది. తర్వాత కుటుంబ కలయికగా ప్రత్యేక ప్రార్థనలు, మాట ముచ్చట వుండేది. ఇదంతా గత ఏడాది వరకే. కానీ, ఈ సారి మాత్రం పరిస్థితులు వేరు.. గత ఏడాది వరకు అన్న చాటు చెల్లిగా, మాజీ ముఖ్యమంత్రి కూతురిగా ఉన్న షర్మిల..ఈ సారి సొంత పార్టీ పెట్టి దానికి అధినేతగా మారాలి అనుకుంటుంది. ఫిబ్రవరి 9న పార్టీ పెడతాను అంటూ  ప్రజల ముందుకు వచ్చిన షర్మిల ..తెలంగాణలో ప్రజా సమస్యలపై స్పందిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. ఎప్పటినుండో అన్న జగన్, చెల్లి షర్మిల మధ్య విబేధాలు, భేదాభిప్రాయాలు ఉండేవని వచ్చిన వార్తలను ఎక్కడా కొట్టేసిన దాఖలాలు లేవు. అలా అని సమర్కాధించిన పరిస్థితీ లేదు.  సొంత అన్న పార్టీ ఏపీలో అధికారంలో ఉండగా, అదే పార్టీకి ఎన్నో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సహకారాన్ని అందించిన షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టడంపై అనేక ప్రశ్నలు వచ్చినా..ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకే వెళ్లారు వైఎస్ షర్మిల.

ఫిబ్రవరి 9 తర్వాత వైఎస్ షర్మిల, వైఎస్ జగన్ ఎక్కడా కలిసిన సందర్భాలు లేవు. కలుసుకునే వేదికా రాలేదు.
ఈ నేపథ్యంలో నే  వైఎస్సార్  జయంతి రోజు జులై 8న ఇడుపులపాయలో ఏం జరగబోతుంది అనే చర్చ ఆసక్తిని కలిగిస్తుంది. కచ్చితంగా షర్మిల తండ్రికి నివాళి అర్పించాలి. అదే సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించడానికి వస్తారూ. చెల్లితో మాట్లాడతార? చెల్లి షర్మిల వచ్చి వెళ్ళాక జగన్ వస్తారా..? ఇదే ఇప్పుడు అనుచరులు చేసుకుంటున్న చర్చ. ఇడుపులపాయలో తండ్రికి నివాళి అర్పించి అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

ఇక ఇటీవలి కాలం లో నీటి పంచాయతీ విషయం లోవైఎస్సార్ ని రాక్షసుడని అన్న వారిపై అన్నాచెల్లెళ్ళు కలిసి అదే ఇడుపులపాయ వేదికగా ఏమైనా మాట్లాడతారా అనే చర్చ కూడా మొదలయ్యింది. మొత్తానికి జులై8 న మాత్రం ఇటు వైఎస్సార్టీపీ, అటూ వైఎస్సార్సీపీ వర్గాల్లోనే కాకుండా  తెలుగు రాష్ట్రాలలోని ప్రజల్లో కూడా చాలా ఆసక్తి కలిగిస్తోంది.

Also Read: Mansas Trust: మాన్సస్ లో హీట్ పెంచిన లింగవివక్ష అంశం..సంచయిత ఫిర్యాదుతో అశోక్ గజపతి రాజు పై పోరుకు మహిళ కమిషన్ రెడీ!

Bhatti Vikramarka: బుజ్జగింపా? మందలింపా? అసలు భట్టి ఎందుకు ఢిల్లీ వచ్చినట్టు.!