Bird of the Week: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా.. శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు

|

Jan 08, 2022 | 2:49 PM

Bird of the Week: ప్రకృతి.. జీవులకు వాటి శరీరం తీరు, రంగు, బలం, ఇలా కొన్ని ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది. వాటిల్లో కొన్ని మరీ ప్రత్యేకం అనిపిస్తాయి. అలా ప్రకృతి రక్షణ పక్షిల్లో ఒకటి పోటు..

Bird of the Week: అరుదైన పక్షి.. అచ్చం కర్రపుల్లలా..  శత్రువుల నుంచి రక్షించుకునేందుకు ప్రకృతి చేసిన ప్రత్యేక ఏర్పాటు
Common Potoo Bird
Follow us on

Bird of the Week: ప్రకృతి.. జీవులకు వాటి శరీరం తీరు, రంగు, బలం, ఇలా కొన్ని ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేసింది. వాటిల్లో కొన్ని మరీ ప్రత్యేకం అనిపిస్తాయి. అలా ప్రకృతి రక్షణ పక్షిల్లో ఒకటి పోటు.. ఇది దక్షిణ అమెరికాలో ఓ పక్షి చూడటానికి పక్షిలాగా ఉండదు. దానిని చూస్తే ఏదో ఎండిపోయిన కర్ర అనుకుంటారు. నరికేసిన చెట్టు కాండం ఎండిపోతే ఎలా ఉంటుందో ఆ పక్షి అలాగే ఉంటుంది. దాని శరీరం, ఈకలు, తల అన్నీ ఎండు కర్రలాగే ఉంటాయి. కలర్ కూడా అలాగే ఉంటుంది. దానికి తోడు ఆ పక్షి ఎప్పుడు వాలినా ఎండిన కర్రలపైనే వాలుతుంది. అలా తాను అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఈ పక్షికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని అకౌంట్‌లో ఈ వీడియోని డిసెంబర్ 27న పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పక్షిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఇలాంటి పక్షులు, జీవులను మభ్యపెట్టే జీవులు అంటారు. ఈ పక్షి పేరు సౌత్ అమెరికా పోటూ . ఎవరైనా మామూలుగా చూస్తే ఈ పక్షి కనిపించదు. ఒకటికి రెండుసార్లు పరిశీలనగా చూస్తేనే అక్కడ ఓ పక్షి ఉన్నట్లు తెలుస్తుంది. కొలంబియాలోని అల్ట్రా నేషనల్ నేచురల్ పార్కులో ఇవి కనిపిస్తాయి. శత్రువుల నుంచి తమను తాము కాపాడుకోడానికి ఈ పక్షులకు అలా ఏర్పాటు చేయబడింది. మరో విశేషమేంటంటే.. పగటిపూట ఈ పక్షులు అస్సలు కదలవు. ఆడపక్షి పెట్టిన గుడ్డును పొదుగుతూ… రెండు జంట పక్షులూ ఒకేచోట కదలకుండా ఉంటాయి. అందువల్ల ఇవి అక్కడ ఉన్న విషయం ఎవరికీ తెలియదు. రాత్రివేళ వేటాడుతూ తమకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటాయి. పగటివేళ మాత్రం ఇవి కళ్లు పూర్తిగా తెరవకుండా జాగ్రత్తపడతాయి. అలా ఈ పక్షులు అన్ని రకాలుగా తమను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడతాయి.

 

Also Read:

“సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం” అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు!