AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Owl: జనగామ జిల్లా కేంద్రంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఇలాంటి దాన్ని ఎప్పుడైనా చూశారా..?

కీకారణ్యంలో ఉండే ఓ అరుదైన గుడ్లగూబ జనారణ్యంలోకి వచ్చింది. గాయపడిన ఆ పక్షిని స్థానికులు రక్షించారు..

Rare Owl: జనగామ జిల్లా కేంద్రంలో అరుదైన గుడ్లగూబ ప్రత్యక్షం.. ఇలాంటి దాన్ని ఎప్పుడైనా చూశారా..?
Ram Naramaneni
|

Updated on: Feb 16, 2021 | 2:11 PM

Share

Rare Owl:  కీకారణ్యంలో ఉండే ఓ అరుదైన గుడ్లగూబ జనారణ్యంలోకి వచ్చింది. గాయపడిన ఆ పక్షిని స్థానికులు రక్షించారు. దట్టమైన అడవుల్లో అరుదుగా కనిపించే గరుడ పక్షిని పోలిన గుడ్లగూబ జనగామ జిల్లా కేంద్రంలో తాజాగా ప్రత్యక్షమైంది. జనగామలోని బతుకమ్మకుంటలో ఈ అరుదైన గుడ్లగుబా కనిపించింది. పక్షి రెక్కకి ఏదో గాయం కావటంతో…కదలేని స్థితిలో పడివుంది. అది చూసిన స్థానికులు.. అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తెల్లని రంగుతో పెద్ద కళ్లు, పొడవాటి ముక్కుతో ఉండే ఈ పక్షి..కేవలం రాత్రిపూట మాత్రమే చాలా అరుదుగా కనబడుతుందని అటవీ అధికారులు చెబుతున్నారు.

ఇది అరుదైన మాస్క్​డ్ గుడ్లగూబ జాతికి చెందిన పక్షిగా చెబుతున్నారు. గుడ్లగూబను స్వాధీనం చేసుకున్న అధికారులు…దాని గాయానికి చికిత్స అందించి.. కోలుకున్న తర్వాత అడవిలో వదిలేస్తామని చెబుతున్నారు.

Also Read:

పెద్దపల్లి జిల్లాలో క్షుద్రపూజల కలకలం.. మనిషి బొమ్మ గీసి..వికృతంగా పసుపు, కుంకుమ చల్లి…

తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో మొదటిసారి.. ఇంకా ఉద్యోగులకు అందని జీతాలు..