AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Swallow Big Eel: పెద్ద ఈల్ చేపను తినడానికి కష్టపడిన ఓ చిన్న చేప.. ఆ చేప తిప్పలు చూస్తే నవ్వు ఆగదు

చింత చెట్టుకు చామంతులు.. పెద్ద చేప చిన్న చేపకు ఆహారం ఇలాంటి ఎన్నో వింతలు కలియుగంలో చోటు చేసుకుంటాయి అంటే నమ్మలేదు.. అయితే తాజాగా ఓ చిన్న చేప పెద్ద చేపని ఆహారంగా తీసుకోవడం కోసం చేసిన చిన్నెలు చూస్తే.. ఎవరికైనా

Fish Swallow Big Eel:  పెద్ద ఈల్ చేపను తినడానికి కష్టపడిన ఓ చిన్న చేప.. ఆ చేప తిప్పలు చూస్తే నవ్వు ఆగదు
Surya Kala
|

Updated on: Feb 16, 2021 | 4:55 PM

Share

Fish Swallow Big Eel: చింత చెట్టుకు చామంతులు.. పెద్ద చేప చిన్న చేపకు ఆహారం ఇలాంటి ఎన్నో వింతలు కలియుగంలో చోటు చేసుకుంటాయి అంటే నమ్మలేదు.. అయితే తాజాగా ఓ చిన్న చేప పెద్ద చేపని ఆహారంగా తీసుకోవడం కోసం చేసిన చిన్నెలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యంఅనిపించకమానదు. పెద్ద చేపను తినడానికి ఆ చిన్న చేప పాట్లు చూస్తే నవ్వు ఆగదు.. దాని నోటి నుంచి రైల్ ఇంజన్‌లా పొగలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ వీడియో ఒకటి వైరల్ అయ్యింది.. వివరాల్లోకి వెళ్తే…

చిన్న చిన్న చేపలు చాలా చూడ ముచ్చటగా ఉంటాయి. నీటితో అటూ ఇటూ ఈదుతూ కను విందు చేస్తుంటాయి. అందమైన ఆ చేపలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కానీ ఈ చేపను చూస్తే మీరు తొలిసారి భయపడతారు. వామ్మో.. ఇదేం చేప అని నోళ్లు వెళ్లబెట్టడం ఖాయం. అవును ఇది ఒళ్లు గగుర్పొడిచే వీడియో. ఓ పొడవాటి ఈల్ చేపను.. మరో చేప మింగే ప్రయత్నం చేసింది. పక్కాగా స్కెచ్ వేసి దాన్ని వేటాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో ఓ భయంకరమైన చేప వీడియోను షేర్ చేశారు. ఓ చేప ఒడ్డుకు చేరి.. బురద మడుగు వద్దకు వెళ్లింది. నీటిలో ఉండే నోటిపైకి ఎత్తి.. దట్టమైన పొగలు వదిలింది. ఎవరో సిగరెట్ తాగినట్లుగా.. రసాయన చర్య జరిగినట్లుగా..గుప్పు గుప్పుమని పొగలు వచ్చాయి. పొగలు వదిలిన తర్వాత ఆ చేప మెల్లగా నీటి లోపలికి మునిగి దాక్కుంది. అనంతరం బుదర మడుగులో నుంచి ఓ భారీ ఈల్ చేప మెల్లగా బయటకు వచ్చింది. పాములా ఉండే ఆ చేప మెల్లగా పాకుతూ నీటిలలో మూతిపెట్టింది. అప్పటికే కాచుకొని ఉన్న ఇంకో చేప.. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఈల్ తప్పించుకొని మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. ఆ తర్వాత టక్కరి చేప మళ్లీ నీటిలో దాచుకుంది. కాసేపటికి ఈల్ మళ్లీ బయటకు వచ్చింది. ఈసారి ఎలాంటి పొరపాటు చేయకుండా.. అమాంత్ ఈల్‌ను నోట్లోకి లాగేసుకుంది. కానీ అది చాలా పొడవు ఉండే సరికి పూర్తిగా మింగలేక.. మళ్లీ బయటకు వదిలిపెట్టింది.

మొత్తం రెండు వీడియోలను సుశాంత నంద ట్వీట్ చేశారు. ఆ వీడియోలను చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. ఇలాంటి ఘటనను ఎప్పుడూ చూడలేని అభిప్రాయపడుతున్నారు. అసలు చేప నోట్లో నుంచి పొగలు ఎలా వస్తున్నాయని ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలా భయానకంగా ఉందని ట్వీట్స్ చేస్తున్నారు. ఐతే మరికొందరు మాత్రం ఇది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తున్నారు.

ఏదేమైనా ఈ వీడియో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఏకంగా ఫారెస్ట్ అధికారే షేర్ చేయడంతో.. నిజమే అయి ఉండొచ్చని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రకృతిలో మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read:

అంతరిక్షంలోకి భగవద్గీత.. భారత జాతి గొప్పతనానికి ఇది మచ్చుతునక.. జయహో ఇండియా