AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Three dads a baby: ఇద్దరు పిల్లలు, ముగ్గురు తండ్రులు, ఇది సుదీర్ఘ ప్రయాణం.. ఆసక్తికర కథనం

అమెరికాలో ముగ్గురు వ్యక్తులు కలిసి తమ పేర్లను ఓ చిన్నారి తల్లిదండ్రులుగా నమోదు చేసుకున్న  అరుదైన  ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యపోకండి.. గందరగోళానికి గురవ్వకండి.

Three dads a baby: ఇద్దరు పిల్లలు, ముగ్గురు తండ్రులు, ఇది సుదీర్ఘ ప్రయాణం.. ఆసక్తికర కథనం
Ram Naramaneni
|

Updated on: Mar 07, 2021 | 5:16 PM

Share

Tree dads a baby: అమెరికాలో ముగ్గురు వ్యక్తులు కలిసి తమ పేర్లను ఓ చిన్నారి తల్లిదండ్రులుగా నమోదు చేసుకున్న  అరుదైన  ఘటన అమెరికాలో వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యపోకండి.. గందరగోళానికి గురవ్వకండి. ఇది పూర్తిగా నిజం.  వాస్తవానికి, అమెరికాలోని ముగ్గురు స్వలింగ సంపర్కులు తమ పేర్లను ‘ముగ్గురు తండ్రులతో కూడిన మొదటి కుటుంబం’ గా నమోదు చేసుకున్నారు. అయితే, ఈ ముగ్గురూ దీని కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్న ఇయాన్ జెంకిన్స్, అలాన్ మేఫీల్డ్, జెరెమీ అలెన్ హోడ్జెస్ అనే ముగ్గురు స్వలింగ సంపర్కుల పేర్లు ఇప్పుడు చరిత్రలో లిఖించబడ్డాయి. ముగ్గురు సర్రోగేట్ తల్లులు, ఒక అండం దాత సహాయంతో ఒక కుమారుడు,  కుమార్తెకు వారు జన్మనిచ్చారు. అయితే మొదటి బిడ్డ కోసం జరిగిన ప్రక్రియలో వారు చాలా ఇబ్బందులు ఎదర్కొన్నారు.   వైద్య విధానాలు, జనన ధృవీకరణ పత్రాలను పొందే చట్టపరమైన ప్రక్రియ కోసం వారు సుమారు రూ .88 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. సుదీర్ఘ వైద్య విధానాలు, న్యాయ పోరాటాల తరువాత, ఈ ముగ్గురూ చివరకు కోర్టులో  విజయం సాధించారు. అమెరికా న్యాయమూర్తి,  వారికి అనుకూలంగా తీర్పు ఇస్తూ, ముగ్గురు వ్యక్తుల పేర్లను పిల్లల జనన ధృవీకరణ పత్రంలో తండ్రిగా చేర్చాలని సూచించారు.

ఇది సుదీర్ఘ ప్రయాణం….

ఇయాన్, అలాన్ దాదాపు 17 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నారు. మూడవ భాగస్వామి జెరెమీ వారితో కలిసి సుమారు 8 ఏళ్లగా వారితో ప్రయాణం సాగిస్తున్నాడు. తన కుమార్తెకు ముగ్గురు తల్లిదండ్రులు ఉన్నారని, ఇది పెద్ద విషయం కాదని ఇయాన్ చెప్పారు. ఇయాన్ ‘త్రీ డాడ్స్ అండ్ ఏ బేబీ: అడ్వెంచర్స్ ఇన్ మోడరన్ పేరెంటింగ్’ అనే పుస్తకం రాశారు. ఆ బుక్‌లో పిల్లలకు జన్మనివ్వడానికి, ముగ్గురు తండ్రుల పేర్లను జనన ధృవీకరణ పత్రంలో నమోదు చేయడానికి చేసిన పోరాటాన్ని సునిశతంగా వివరించారు. తల్లిదండ్రులు,  పిల్లల హక్కులను నిర్ధారించడానికి ముగ్గురు తండ్రుల పేర్లను బర్త్ సర్టిఫికేట్‌లో నమోదు చేయడం అవసరం అని ఇయాన్ చెప్పారు. కానీ ఈ ప్రక్రియ మానసికంగా తమకు చాలా కష్టతరంగా సాగిందని వివరించారు. హక్కుల కోసం తాము చేసిన పోరాటం.. తమలాంటి వ్యక్తులకు మున్ముందు స్పూర్తిదాయకంగా ఉంటందని చెప్పారు.

Also Read :

తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు

ఆ కొండంతా బంగారమే.. తవ్వుకున్నోడికి..తవ్వుకున్నంత..