Mother Love: ప్రపంచంలో అన్నింటికన్నా విలువైంది.. వెలకట్టలేనిది ఏదైనా ఉంది అంటే అది అమ్మ ప్రేమే.. మనుషుల్లోనే కాదు జంతువుల్లోనూ తల్లిప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి జంతువులో మనకన్నా చాలా ఎమోషనల్. ప్రేమ.. భాద వంటివి మనుషులకన్నా ఎక్కువగానే ఉంటాయి. ఇక జతువులు తమ పిల్లలపై చూపే ప్రేమ అనిర్వచనీయం. ఎంతటి ప్రమాదాన్నైనా ఎదిరించి తమ పిల్లలను రక్షించుకుంటుంటాయి మూగజీవాలు. తాజాగా ఓ కుక్క చేసిన పని ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. ఇటీవల కుండపోతగా కురుస్తున్నవర్షాల కారణంగా సంభవించిన వరదాలనుంచి తన పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఓ కుక్క చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వరదలో చుక్కుకున్న తన పిల్ల కోసం ఆ కుక్కపడిన తాపత్రయం చూస్తే కళ్ళు చమర్చాకుండా ఉండవు..
మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు- వంకలు ఉప్పోగుతున్నాయి. జిల్లాలోని మార్కెట్ యార్డు చుట్టూ పక్కల వరదనీరు ముంచెత్తడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే అక్కడ ఉన్న ఒక మార్కెట్ యార్డ్ దగ్గర ఒక కుక్కపిల్ల చిక్కుకుంది. తల్లి కనిపించకపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక ఏడుస్తూ ఉండిపోయింది. అయితే దాని ఏడుపు విన్న తల్లి కుక్క పరుగు పరుగున అక్కడకు చేరుకుంది. తన పిల్లను నోటకరుచుకొని ఎంతో చాకచక్యంగా సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళింది. అక్కడకు దూరంగా ఉన్న పొదల మధ్య ఓ చిన్న గుంతతోవి అందులో తన పిల్లను సురక్షితంగా దాచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :