AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Modi – Mamata: ప్రధాని మోదీ, బంగాల్​సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా టాపర్స్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్​సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా టాపర్స్ గా నిలిచారు. అత్యంత

Modi - Mamata:  ప్రధాని మోదీ, బంగాల్​సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా టాపర్స్
Modi Mamata
Venkata Narayana
|

Updated on: Sep 15, 2021 | 10:22 PM

Share

Influential people – Modi – Mamata: భారత ప్రధాని నరేంద్ర మోదీ, బెంగాల్​సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా టాపర్స్ గా నిలిచారు. అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాలో వీరికి చోటు దక్కింది. భారత్​ తరఫున ప్రధాని మోదీ సహా బంగాల్​ సీఎం మమతా బెనర్జీ, సీరం సంస్థ సీఈఓ అదర్​ పూనావాలాకి ఈ జాబితాలో చోటు దక్కింది.

ఇక, ఈ జాబితాలో అత్యంత చిన్న వయస్కురాలిగా 18 ఏళ్ల జిమ్నాస్ట్​సునీసా లీ.. పెద్ద వయస్కుడిగా 78 ఏళ్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎంపికయ్యారు. ఇదే జాబితాలో అఫ్ఘాన్‌ ప్రధాని అబ్దుల్ బరాదర్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, సింగర్, పాటల రచయిత బిల్లీ ఎలిష్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డీజీ ఎన్‌గోజీ, ఎన్విడియా సీఈఓ హువాంగ్, రచయిత కాథీ పార్క్, ప్రిన్స్ హ్యారీ-మేఘన్, జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, నటి కేట్ విన్స్‌లెట్ వంటి ప్రముఖులకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది.

ఇలా ఉండగా, ఇవాళ 2021 సంవత్సరానికి గాను అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేసింది టైమ్ మ్యాగజైన్​. 18వ వార్షిక జాబితాలో మార్గదర్శకులు, కళాకారులు, నాయకులు, ఆవిష్కర్తలతోపాటు తదితరులు ఉన్నట్లు వెల్లడించింది.

Read also: Saidabad case: ఒక్కడు.. 3 వేల మంది పోలీసులు.. వేలాది కెమెరాలు.. 6 రోజులు. ఎక్కడికి వెళ్లాడు.. ఎందుకు దొరకలేదు?