World’s dirtiest man: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి.. 65 ఏళ్లగా స్నానమే చేయలేదట

|

Jan 18, 2021 | 9:25 PM

ఒక్కరోజు స్నానం చేయకపోతేనే బ్యాడ్‌స్మెల్‌తో మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట.

Worlds dirtiest man: ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి.. 65 ఏళ్లగా స్నానమే చేయలేదట
Follow us on

world’s dirtiest man: ఒక్కరోజు స్నానం చేయకపోతేనే బ్యాడ్‌స్మెల్‌తో మనతో పాటు మన చుట్టూ ఉన్నవారికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఇరాన్‌కు చెందిన అమౌ హాజీ అనే ఓ వ్యక్తి స్నానం చేయక దాదాపు 65 ఏళ్లకు పైనే అయ్యిందట. దీంతో ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా పేరుగాంచిన హాజీ 83 ఏళ్ల వయసులోనూ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. ఇరాన్‌లోని దెజ్‌ అనే ప్రాంతంలో నివసిస్తున్న హాజీ ఇరవై ఏళ్ల వయసున్నప్పుడు అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో రోజూ స్నానం చేయడం వల్లే ఆరోగ్యం దెబ్బతిందని భావించి..అప్పటినుంచి స్నానం చేయడం మానేశాడట.

కాగా, ఎక్కువగా నాన్‌వెజ్‌ వంటకాలను ఇష్టపడే హాజీ కుళ్లిపోయిన మాంసాన్ని కూడా తినేస్తాడట. ఊరి బయట ఓ చిన్న గుడిసెలో నివసించే హాజీకి అక్కడి గ్రామస్తులే భోజనం పెడుతారు. అంతేకాకుండా ఆరు దశాబ్దాలుగా పైగా స్నానం చేయకపోయినా తన అందాన్ని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. కుళ్లిపోయిన అడవిపంది మాంసాన్ని చాలా ఇష్టంగా తింటానని, రోజుకు అయిదు లీటర్ల నీటిని మాత్రం తాగుతుంటానని హాజీ తెలిపాడు.

అంతేకాకుండా తనకు పొగతాడటం అంటే చాలా ఇష్టమని, ఒకవేళ సిగరెట్‌ అందుబాటులో లేకపోతే జంతువుల వ్యర్థాలనే చుట్టలా కాల్చుకొని తాగుతానని పేర్కొన్నాడు. ఇంత అపరిశుభ్రంగా, మురికిగా ఉన్నప్పటికీ హాజీ ఎంతో ఆరోగ్యంగా ఉండడం, అతని చుట్టు పక్కల వారినే కాకుండా ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచేలా ఉంది. ఏదయితేనేం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా హాజీ రికార్డులకెక్కాడు.

Also Read :

QR code on wedding card: వాటే ఐడియా.. పెళ్లి శుభలేఖపై QR కోడ్.. గిఫ్ట్ మనీని పంపేందుకు వీలుగా.. ఎక్కడంటే..

Archaeological Discovery:తవ్వకాల్లో 3వేల ఏళ్ల నాటి శవపేటిక, ఆలయం, మాస్క్ లు, ఆటవస్తులు చరిత్రను తిరగరాస్తాయా..!