ఈ చేప ఖరీదు కోటి రూపాయలు..! బంగారం, డైమండ్స్ కన్నా విలువైంది.. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!

Dragon Fish : జనాలు చేపలను రెండు రకాలుగా మాత్రమే వినియోగిస్తారు.. ఒకటి తినడం కోసం రెండోది అక్వేరియంలో సందర్శన కోసం. తినే చేపలకైతే వేయి, రెండు వేలు, అక్వేరియానికైతే రూ.10 నుంచి రూ. 20

ఈ చేప ఖరీదు కోటి రూపాయలు..! బంగారం, డైమండ్స్ కన్నా విలువైంది.. దీని గురించి తెలిస్తే మీరు షాక్ అవ్వాల్సిందే..!
Dragon Fish
Follow us

|

Updated on: Mar 30, 2021 | 7:05 PM

Dragon Fish : జనాలు చేపలను రెండు రకాలుగా మాత్రమే వినియోగిస్తారు.. ఒకటి తినడం కోసం రెండోది అక్వేరియంలో సందర్శన కోసం. తినే చేపలకైతే వేయి, రెండు వేలు, అక్వేరియానికైతే రూ.10 నుంచి రూ. 20 వేలు ఖర్చు చేస్తారు. కానీ కొంతమంది ఒక చేప కోసం రెండు, మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం.. అంతేకాదు ఈ చేపను కొనుగోలు చేసిన తర్వాత దాని భద్రత కోసం కూడా చాలా డబ్బు ఖర్చు చేస్తారు. ప్రత్యేకంగా కాపాలదారులను నియమిస్తారు. అయితే అంతలా ఈ చేపలో ఏముంది.. ఎందుకంత ఖర్చు చేస్తున్నారని అందరికి అనుమానం వస్తుంది. అయితే ఆ చేప రహస్యాలను ఇప్పడు తెలుసుకుందాం..

ఈ చేప ఖరీదైన బంగారం, డైమండ్స్ కన్నా విలువైంది. దీని పేరు డ్రాగన్ ఫిష్.. ఆసియా అరవోనా అని కూడా అంటారు. ఈ చేప ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చేప. ఒక అధ్యయనం ప్రకారం చైనా ప్రజలు ఈ చేప కోసం ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నారు. ఈ చేప గురించి ది డ్రాగన్ బిహైండ్ ది గ్లాస్ అనే పుస్తకం కూడా రాసారు. ఈ చేప జీవిత చరిత్ర మొత్తం ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది. ఈ చేప ధర ఎక్కువగా ఉండటం వల్ల దీనికోసం పలు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అరోవన్ అందరికి కనిపించే ఒక సాధారణ చేప కాదు. ఇది ఆగ్నేయాసియాలో కనుగొన్నారు. ఇది 3 అడుగుల పొడవు ఉంటుంది.

ఈ సింగిల్ ఫిష్ ధర 2 నుంచి 3 కోట్లు ఉంటుంది. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల దాని ధర కోట్లు పలుకుతుంది. ప్రజలు కూడా ఈ చేపను కొనడానికి ఎంతకైనా తెగిస్తారు. చైనాలో ఈ చేప ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. ప్రజలను సంక్షోభం నుంచి బయటపడేస్తాయని నమ్ముతారు. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి ఈ చేపను విక్రయించాడు.. ఓ వ్యాపారి ఈ చేపను భారతీయ కరెన్సీ ప్రకారం.. రూ.2 కోట్ల 20 వేలకు కొనుగోలు చేశాడు. ఇంత ఖరీదైనా ప్రజలు దానిని లెక్క చేయకుండా కొనుగోలుకు ముందుకు వస్తారు.. అదే ఈ చేప గొప్పతనం..

మరిన్ని చదవండి : మయన్మార్ సరిహద్దుల్లో టీటీడీ తలనీలాలు కలకలం.. పట్టుబడిన జుట్టుపై వివరణ ఇచ్చిన అధికారులు

Tirupati By Election 2021 : తిరుపతి బై పోల్ అభ్యర్థులు రత్నప్రభ, పనబాక, గురుమూర్తి, చింతా ఆస్తుల ఫుల్ డిటైల్స్

ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. వయోపరిమితి పెంపు ఉత్తర్వులు జారీ.!