ఏమండోయ్.. చిన్నమాట.. దెయ్యాలున్నాయంటే మీరు నమ్ముతారా… నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పే ఈ విషయాన్ని నమ్మి తీరాల్సిందే.. మీకొక దెయ్యం కథ.. కాదు కాదు.. “దెయ్యం రైలు” కథ చెప్తాను.. 106 మంది ప్రయాణికులతో బయలుదేరిన రైలు సడన్‌గా అదృశ్యమైపోయిందట.. ఇప్పటికీ తిరిగి రాలేదట.. అది ఎక్కడో.. ఏమిటో తెలుసుకుందాం.. ప్రపంచంలో తరచుగా వింత సంఘటనలు జరుగుతుండటం మనం చూస్తుంటాం. వీటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక్కోసారి కొన్ని వింత సంఘటనల సంబంధించిన వాస్తవాలు వెల్లడవుతా… కొన్నిసందర్భాల్లో కొన్ని సంఘటనలు ఒక ఫజిల్‌గా మిగిలిపోతాయి. అలాంటిదే ఈ సంఘటన కూడా.. దాని గురించి తెలుసుకుంటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఇది 106 మంది ప్రయాణికులతో మిస్సయిన ‘దెయ్యం రైలు’ కథ. ఇప్పటి వరకు ఆ రైలు తిరిగి రాలేదట. 1911 సంవత్సరంలో ఇటాలియన్ కంపెనీ జానెట్టి ఒక రైలును ప్రారంభించిందట. ఈ రైలు 106 మంది ప్రయాణికులతో మొదటిసారిగా ప్రయాణాన్ని ప్రారంభించిందట.. కానీ ఇప్పటి వరకు తిరిగి రాలేదట. ఈ రైలు తన ప్రయాణ సమయంలో రైలు ఒక సొరంగం దగ్గరకు చేరుకుందని, ఆ సొరంగం గుండా ప్రయాణించాల్సిన రైలు లోపలికి ప్రవేశించగానే అదృశ్యమైపోయిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమట.!
రైల్లో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులకు సొరంగం దగ్గరకు రైలు చేరుకుంటున్న సమయంలో ఒక అనుమానాస్పదమైన పొగ రావడం కనిపించిందట. దాంతో వారు ఒకింత అనుమానంతోనూ, భయంతోనూ రైల్లోనుంచి దూకేసి పారిపోయారట. అలా సొరంగంలోకి వెళ్లిన ఈ ఇటాలియన్ రైలు మళ్లీ తిరిగి రాలేదట. అప్పటినుంచి ఈ సంఘటన మిస్టరీగానే మిగిలిపోయిందట. దీని గురించి ఇప్పటికీ అక్కడి ప్రజలు చర్చించుకుంటారట.
మరిన్ని ఇక్కడ చదవండి :