ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్

|

Jan 27, 2021 | 4:38 PM

అదిగో పులి పిల్లలు.. ఇదిగో పులి పిల్లలు అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో కాసేపు హడావిడి జరిగింది. పిల్లలు అయితే నిజంగానే ఉన్నాయి కానీ అవి ఏమి పిల్లలో ఇప్పుడు  తెలుసుకుందాం పదండి. 

ఏపీలోని ఆ ఊళ్లో పులి పిల్లలు, సోషల్ మీడియాలో జనాల హడావిడి.. కానీ చివరకు సీన్ రివర్స్
Follow us on

అదిగో పులి పిల్లలు.. ఇదిగో పులి పిల్లలు అంటూ పశ్చిమ గోదావరి జిల్లాలో కాసేపు హడావిడి జరిగింది. పిల్లలు అయితే నిజంగానే ఉన్నాయి కానీ అవి ఏమి పిల్లలో ఇప్పుడు  తెలుసుకుందాం పదండి.  వివరాల్లోకి వెళ్తే.. కుక్కునూరు అటవీ ప్రాంతం దగ్గర్లో మద్దిగట్ల దగ్గర పిల్లలు దర్శనమిచ్చాయి. ఆశ్యర్యానికి గురైన స్థానికులు వెంటనే వాటి ఫోటోలు క్లిక్ చేసి సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ చేశారు. దీంతో విషయం పారెస్ట్ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ పిల్లల్ని పరిశీలించారు.ఫైనల్ అవి అడవి పిల్లి పిల్లలని నిర్ధారించారు.

వెంటనే ఆ పిల్లల్ని తీసుకెళ్లి అడవిలో వదిలి పెట్టారు. పొరపాటున దారితప్పి అవి అటవీ ప్రాంతం నుంచి గ్రామం వైపు వచ్చి ఉండొచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. అవి పులి పిల్లల మాదిరిగా ఉండటంతో స్థానికులు కంగారు పడ్డారని తెలిపారు. మొత్తానికి ఈ బుజ్జి బుజ్జి అడవి పిల్లి పిల్లలు అటు సోషల్ మీడియాతో పాటు కుక్కునూరు పరిసర ప్రాంతాలలో కాసేపు హల్‌చల్ చేశాయి.

Also Read:

Earth Lost Tons of Ice: గత 30 ఏళ్ల కంటే వేగంగా కరుగుతున్న మంచు.. మానవాళికి ప్రకృతి సరికొత్త హెచ్చరికను జారీ చేసిందా..!

ఫ్రీ షీ షటిల్ బస్‌లను ప్రారంభించిన అనుష్క.. ప్రతి మహిళా పోలీస్ ఒక స్టార్ అని ప్రశంస