Corpse Flower : ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి వికసిస్తుంది.. కానీ శవంలా ఉంటుంది..! అయినా అందరు చూడటానికి వస్తారు.. కారణం..?

|

May 21, 2021 | 6:27 PM

Corpse Flower : ఈ ప్రపంచం చాలా వింత విషయాలతో నిండి ఉంటుంది. ఈ రోజు మనం ఒక పువ్వు గురించి తెలుసుకుందాం.

Corpse Flower : ఈ పువ్వు పదేళ్లకు ఒకసారి వికసిస్తుంది.. కానీ శవంలా ఉంటుంది..! అయినా అందరు చూడటానికి వస్తారు.. కారణం..?
Corpse
Follow us on

Corpse Flower : ఈ ప్రపంచం చాలా వింత విషయాలతో నిండి ఉంటుంది. ఈ రోజు మనం ఒక పువ్వు గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ పువ్వు 10 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే వికసిస్తుంది. ఈ పువ్వు పైభాగం చాలా చెడ్డ వాసన వస్తుంది కనుక ప్రజలు ముక్కు మూసుకొని చూడాల్సివస్తుంది. ఈ పువ్వు గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో ‘కార్ఫ్స్ ఫ్లవర్’ అనే అరుదైన పువ్వు కనుగొనబడింది. ఈ పువ్వు దాదాపు 10 సంవత్సరాల తరువాత వికసించిందని తెలిసింది.

దీంతో ప్రజలు దూర ప్రాంతాల నుంచి దీనిని చూడటానికి వస్తున్నారు. అయితే దాని వాసన చాలా చెడ్డది. ప్రజలు ముక్కు మూసుకుంటారు. నివేదిక ప్రకారం.. బే ఏరియా నర్సరీలో ఈ అరుదైన పువ్వు వికసించింది. నర్సరీలో పనిచేసే వర్కర్లు పువ్వు ఫోటోను క్లిక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. పువ్వు చిత్రాన్ని చూసిన తరువాత చాలా మంది దీనిని చూడాలనుకుంటున్నారు.

ఈ పువ్వును చూడటానికి చాలామంది ప్రజలు దూర ప్రాంతాల నుంచి వస్తున్నారని నర్సరీ యజమాని చెబుతున్నారు. ఈ పువ్వు 12 అడుగుల ఎత్తు వరకు ఉంటుందని యుఎస్ బొటానిక్ గార్డెన్ తెలిపింది. వికసించడానికి సుమారు 10 సంవత్సరాలు పడుతుంది. ఆశ్చర్యకరంగా ఈ పువ్వు వాసన చాలా చెడ్డగా ఉంటుంది. అది సాధారణమైనది కాదు పచ్చి మాంసం లేదా శవం వాసన వస్తుంది. ఈ పువ్వు వద్దకు చేరుకోగానే ప్రజలు ముక్కులు మూసుకుంటారు.

Leech Therapy : జలగలతో బ్లాక్ ఫంగస్‌కి మందు..! వైద్యులు వీటిని ఎలా ఉపయోగిస్తారో తెలుసా..?

Coronavirus: ఆ 10 రాష్ట్రాల్లోనే 76 శాతం కరోనా పాజిటివ్‌ కేసులు: కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

Viral News: చేపల కోసం వల వేసిన మత్స్యకారులు..ఎదురుగా ఊహించని షాక్‌.. గగుర్పొడిచే దృశ్యం.!

PPF Scheme: నెలకు రూ. 1000 పెట్టుబడితో.. రూ. 26 లక్షలు సంపాదించవచ్చు… ఎలాగంటే..?