సాధారణంగా ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు ఉంటాయి. అయితే ఒక్కో భాగంలో ఉండే పుట్టుమచ్చ ఆ వ్యక్తి భవిష్యత్తులు ఏ విధంగా నిర్ణయిస్తుందో సాముద్రిక శాస్త్రం వివరిస్తుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం.. శరీరంలోని వివిధ భాగాలలో పుట్టుమచ్చలు అందాన్ని పెంచడమే కాకుండా అదృష్టాన్ని కూడా సూచిస్తాయి. ఆ వ్యక్తి బలాలు, బలహీనతలను కూడా తెలుసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా శరీరంలోని ఈ భాగాలపై పుట్టుమచ్చలు శుభ, అశుభ సంకేతాలను తెల్పుతాయి. అవేంటంటే..
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. ముక్కు కొనపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి వివిధ ప్రతిభల్లో ఆరితేరి ఉంటారు. అలాంటి వ్యక్తి చాలా అదృష్టవంతుడు. జీవితంలో సంతోషంతోపాటు సంపన్నుడు కూడా అవుతాడు. అలాంటి వ్యక్తులు వారి వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు. ముక్కు కుడి వైపున పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు వారి తల్లిదండ్రుల నుంచి మరింత గౌరవం, మద్దతు లభిస్తుంది. కానీ ముక్కు పైభాగంలో అంటే కనుబొమ్మల దగ్గర పుట్టుమచ్చ ఉంటే ఆర్థికంగా కష్టాలు, ఉద్యోగం రావడం కష్టం అవుతుంది. ఆర్థిక అస్థిరత కూడా ఉంటుంది.
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చెవిలో పుట్టుమచ్చ ఉన్నవారు చాలా నిజాయితీపరులు. అలాంటి వ్యక్తి ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. చెవి క్రింద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు స్వభావంలో చాలా భావోద్వేగాన్ని కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలను కూడా మనసుకు తీసుకుంటారు. అంటే చాలా సున్నిత మనస్కులన్నమాట.
కంటిలో మచ్చ ఉన్న వ్యక్తులు ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు. ప్రతి అడుగులో విజయం సాధిస్తారు. ఇలాంటి వారికి డబ్బుకు లోటు ఉండదు.
పై పెదవికి కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నవారు చాలా అదృష్టవంతులని నమ్ముతారు. వారు జీవితంలో అన్ని రకాల సుఖాలు, విలాసాలను చాలా సులభంగా పొందుతారు. అలాంటి వ్యక్తులు ప్రేమలో విజయం సాధిస్తారు. పెదవికి ఎడమ వైపున పుట్టుమచ్చ ఉంటే అశుభంగా భావిస్తారు.