చెత్త వేయడానికి నలుపు రంగులో ఉండే ప్లాస్టిక్ పాలిథిన్‌ని వాడటం మనం చూస్తూనే ఉంటాం. వీటి ధర మహా అయితే, రూ.50 లేదా రూ.100లు ఖర్చవుతాయి. ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండ్ అవుతోన్న ఓ చెత్త వేసే బ్యాగ్.. ధర తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి, గార్జేజ్ బ్యాగ్‌కు లక్ష రూపాయాలా.. అని ఆశ్చర్యపోకండి. నిజమే, దాని వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఒక విలాసవంతమైన ఫ్యాషన్ హౌస్ ఇటువంటి చెత్త బ్యాగ్‌ను విడుదల చేసింది. దీని ధర లక్షల్లో ఉంది.
దీనిని ‘ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్’ అని పిలుస్తున్నారు. దీని ధర రూ. 500-1000లు కాదు, $ 1,790 అంటే దాదాపు 1 లక్షా 42 వేల రూపాయలు అన్నమాట. ఈ విషయం తెలిసి ఒంట్లోని ఇంద్రియాలు పనిచేయడం ఆగిపోయనంత పని అయిందా. అవును నిజమే.. ఇంతకీ ఈ ఖరీదైన ‘ట్రాష్ బ్యాగ్’ని ఎక్కడ, ఎప్పుడు ప్రారంభించారో ఇప్పుడు తెలుసుకుందాం..
నివేదికల ప్రకారం, ప్రసిద్ధ ఫ్యాషన్ హౌస్ Balenciaga ఈ ‘చెత్త బ్యాగ్’ని ప్రారంభించింది. దీని ఫొటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. బాలెన్‌సియాగా ఫాల్ 2022 రెడీ-టు-వేర్ కలెక్షన్‌లో ఈ గార్బేజ్ బ్యాగ్ కనిపించింది. అక్కడ మోడల్‌లు తమ చేతుల్లో చెత్త బ్యాగ్‌ని మోస్తూ ర్యాంప్‌పై నడిచారు. ఇప్పుడు షాపుల్లోనూ ఈ బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి.
If you don’t see the beauty in the Balenciaga trash bag you just don’t understand fashion. It only costs $1,790. pic.twitter.com/eWP7XbzBB5
— ADM87 (@adm87) July 31, 2022
Balenciaga Trash Bag. Lol. Now those trash going out in style. pic.twitter.com/VwjsB3710r
— Cult Survivor (@user023k) July 30, 2022
High fashion is a joke at this point. Balenciaga made a “trash bag” pouch going for $1790. Is this world real ? ??♂️
— Kadeem (@DapperVigilante) August 4, 2022
కొనాలని అనుకుంటే.. భారీగా ఖర్చు చేయాల్సిందే..
నీలం, పసుపు, నలుపు, తెలుపు అనే నాలుగు రంగుల్లో ఈ మెరిసే ‘ట్రాష్ బ్యాగ్’ మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ సంచిని కట్టడానికి ఒక లేస్ కూడా అందించారు. ధరతో పాటు, ఈ బ్యాగ్ గురించి మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ బ్యాగ్‌ను దూడ తోలుతో తయారు చేశారంట. ఈ చెత్త బ్యాగ్ భిన్నమైనది, ఎంతో ప్రత్యేకమైనదంట. అయినా, ప్రజలు మాత్రం దీన్ని అస్సలు ఇష్టపడడంలేదంట. కేవలం ఫోటోలు షేర్ చేస్తూ రకరకాల రియాక్షన్స్ ఇస్తున్నారంట.