Covid Strain Cases In India: దేశంలో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు.. అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ

ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ

Covid Strain Cases In India: దేశంలో 82 కరోనా స్ట్రెయిన్ కేసులు.. అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ
Follow us

|

Updated on: Jan 08, 2021 | 2:00 PM

Covid Strain Cases In India: ఇండియాలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అందరూ ఊరటగా ఉన్న వేళ కరోనా స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. దేశంలో కోవిడ్ స్ట్రెయిన్ కేసులు సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 82 స్ట్రెయిన్ వైరస్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. జనవరి 6న ఈ సంఖ్య 73గా ఉంది. స్ట్రెయిన్ సోకినవారి పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వారిని సింగిల్ రూమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది. ఈ వైరస్ సోకినవారితో పాటు వారితో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

స్ట్రెయిన్ వైరస్ కట్టడిని అడ్డుకునేందుకు కేంద్రం భారత్‌-యూకే మధ్య విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆ బ్యాన్ ఎత్తివేశారు. జనవరి 6న భారత్‌ నుంచి యూకేకు తిరిగి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.. నేడు యూకే-భారత్‌ సేవలు పునరుద్ధరించారు. అయితే బ్రిటన్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయంలోనే ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయనున్నారు. అంతేగాక, విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు నిబంధన విధించారు.

Also Read :

APPSC Recruitment 2021: కీలక నిర్ణయం దిశగా ఏపీపీఎస్సీ.. ఇకపై పరీక్షలన్నీ ఆన్​లైన్​లోనే !

US violence: డొనాల్డ్ ట్రంప్‌పై ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఉక్కుపాదం.. నిషేధం మరో రెండు వారాలు పొడిగింపు

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు

Latest Articles
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
కొత్త ఓటర్లతో ముచ్చటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!
అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!