Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు

పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం చిత్తూరు జిల్లా. తిరుమల , శ్రీకాళహస్తీ, కాణిపాకం, గోవింద రాజస్వామి దేవాలయం, వరదరాజ స్వామి, కపిల తీర్థం, శ్రీనివాస మంగపురం, తొండమాన్, తిరుచానూరు పద్మావతి లాంటి...

Security to Temples: విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసులు అలెర్ట్.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాలు
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 08, 2021 | 7:37 AM

Security to Temples: పవిత్ర పుణ్యక్షేత్రాలకు నిలయం చిత్తూరు జిల్లా. తిరుమల , శ్రీకాళహస్తీ, కాణిపాకం, గోవింద రాజస్వామి దేవాలయం, వరదరాజ స్వామి, కపిల తీర్థం, శ్రీనివాస మంగపురం, తొండమాన్, తిరుచానూరు పద్మావతి లాంటి ఎన్నెన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. రాష్ట్రంలో వరుసగా ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఈ జిల్లాలో అలాంటి ఘటనకు అవకాశం లేకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు పోలీసులు.. ప్రతి ఆలయం దగ్గర సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు భద్రతను పెంచారు. మారు మూల ఉన్న అలయాలపైనా ప్రధానంగా దృష్టి సారించారు.

ఇక అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆలయాల నిర్వాహకులు, ఉద్యోగులతో పోలీసులు సమావేశమయ్యారు.. అలాగే ఆలయాలపై దాడులు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా పోలీస్ ఉన్నతాధికారులు సూచనలు ఇస్తున్నారు. జిల్లాలో టీటీడీ అనుబంధ ఆలయాలతోపాటు దేవాదాయ శాఖ ఆలయాలు, ప్రైవేట్ ఆలయాలు 4 వేలకు పైగానే ఉన్నాయి. దాదాపు 4 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో డిఫెన్స్ కమిటీ లను ఏర్పాటు చేసి ఆలయాల భద్రతపై నిఘా పెంచారు.

ఆపరేషన్‌ సురక్ష కొనసాగుతోంది. మత సామరస్యాన్ని దెబ్బ తీసేందుకు ప్రయత్నించే అసాంఘిక శక్తులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామన్నా ఎస్పీ సెంథిల్‌ కుమార్‌. అవసరమైతే పిడీ యాక్ట్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. అన్ని ఆలయాలపై పోలీసులు దృష్టిపెట్టాలంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అనుమానిత వ్యక్తులు గ్రామంలోకి ఆలయ పరిసరాల్లోకి వస్తే.. వెంటనే సంచారం ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ చిత్తూరు జిల్లాలో ఒక్క ఆలయంలో కూడా ఇలాంటి ఘటన జరగకుండా చూస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

Also Read : Corona Vaccine Dry Run: నేడు హైదరాబాద్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్.. మొత్తం 78,226 మందిని గుర్తింపు

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌