Bird Flu Alert: మరిన్ని రాష్ట్రాలకు పాకిన బర్డ్ ఫ్లూ.. పౌల్ట్రీ దిగుమతులను నిషేధించిన జమ్ముకశ్మీర్..
Bird Flu Alert: రోజురోజుకీ దేశంలో బర్డ్ ఫ్లూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనాను నుంచి బయట పడుతున్నామనుకుంటోన్న తరుణంలో మరో వైరస్..

Bird Flu Alert: రోజురోజుకీ దేశంలో బర్డ్ ఫ్లూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కరోనాను నుంచి బయట పడుతున్నామనుకుంటోన్న తరుణంలో మరో వైరస్ తన పంజా విసురుతోంది. పెద్ద ఎత్తున పక్షులు చనిపోతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కేసులు భారీగా నమోదైన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే హర్యానలోని పంచ్‌కుల ప్రాంతంలో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లో ప్రభుత్వాలు బర్డ్‌ఫ్లూను కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇక జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఇక బర్డ్‌ఫ్లూ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టవేయడానికి కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకూ సూచించింది. వైరస్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని తెలిపింది. రాష్ట్రాలతో నిరంతర సమన్వయం, తగు సూచనల జారీ కోసం ఢిల్లీలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే బర్డ్‌ఫ్లూ మనుషులకు సోకే అవకాశం తక్కువ అని ఓవైపు చెబుతున్నా.. మరోవైపు ఈ వైరస్ సోకిన 10 మందిలో ఆరుగురు మృత్యువాత పడే అవకాశముందని చెబుతోన్న నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read: Corona positive Teachers: 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్.. అప్రమత్తమైన అధికారులు