Elon Musk: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..? అమేజాన్ సీఈఓను వెనక్కి నెట్టిన కార్ల సంస్థ అధినేత..
Elon Musk becomes world's richest person: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే...
Elon Musk becomes world’s richest person: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఇప్పటి వరకు మనకు తెలిసిన పేరు అమేజాన్ సీఈఓ జెఫ్ బెజోస్. అయితే ఆయన్ని వెనక్కి నెడుతూ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు.
బ్లూమ్‌బర్గ్ నివేదిక ఆధారంగా గురువారం టెస్లా షేర్ల ధర ప్రకారం.. ఎలాన్ మస్క్ సంపద విలువ ఏకంగా 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ సంపదతో పోలీస్తే.. ఇది 1.5 బిలియన్ డాలర్లు అధికం. ఇక గతేడాది ధనవంతుల జాబితాలో 35వ స్థానంలో ఉన్న మస్క్.. ఏడాది కాలంలోనే మొదటి స్థానానికి చేరుకోవడం విశేషం. టెస్లా షేరు ధర గతేడాది ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. ఇక 2020 నవంబర్ చివరిలో ఎలాన్ మస్క్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానంలో నిలవగా.. ఇప్పుడు కేవలం రెండు నెలల్లోనే మొదటి స్థానానికి చేరారు. ఇక ఎలాన్ మస్క్ కేవలం కార్ల సంస్థనే కాకుండా స్పేస్ ఎక్స్ పేరుతో రాకెట్ల తయారీ సంస్థతో పాటు, న్యూరాలింక్ అనే మరో సంస్థను కూడా స్థాపించారు.
Also Read: Car Companies Hopes: కొత్త ఏడాదిలో కార్ల కంపెనీల ఆశలు.. సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు