Farmers Protest: ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళలు.. నేడు రైతు సంఘాలతో కేంద్రం ఎనిమిదో విడత చర్చలు
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
Farmers Protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎనిమిదో సారి రైతులు, కేంద్రం మధ్య చర్చలు జరగనున్నాయి. 40 రైతు సంఘాల కేంద్ర మంత్రులు వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరకు చట్టబద్దత లాంటి కీలకాంశాలపై చర్చించనున్నారు.
కాగా, గతంలో జరిగిన చర్చల్లో రెండు అంశాలపై కుదిరిన ఏకాభిప్రాయానికి కేంద్రం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. అటు వ్యవసాయ చట్టాల్లోని అభ్యంతరాలపై అంశాల వారీగా చర్చిస్తామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే నేటి చర్చలు సఫలం అవుతాయని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ చర్చలు విఫలమైతే మాత్రం భవిష్యత్తులో ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఇప్పటికే రైతుల సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. నేడు జరిగే చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
H-1B Visa Restrictions: హెచ్ బీ1 వీసాల జారీపై ట్రంప్ విధించిన ఆంక్షలను తొలగిస్తా: జో బైడెన్