Pune Zomato Delivery Boy : పార్శిల్ తెచ్చిచ్చాడు.. ముద్దు పెట్టి మామ అనుకోమన్నాడు.. కట్ చేస్తే సీన్ సీతారే..

Zomato Delivery Man: ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్స్ సైలెంట్‌గా ఫుడ్ డెలివరీ చేసి పోతారనే నమ్మకమే పోతోంది జనాల్లో.

Pune Zomato Delivery Boy : పార్శిల్ తెచ్చిచ్చాడు.. ముద్దు పెట్టి మామ అనుకోమన్నాడు.. కట్ చేస్తే సీన్ సీతారే..
Zomato

Updated on: Sep 20, 2022 | 12:31 PM

Zomato Delivery Man: ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడితే.. డెలివరీ బాయ్స్ సైలెంట్‌గా ఫుడ్ డెలివరీ చేసి పోతారనే నమ్మకమే పోతోంది జనాల్లో. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు ఈ భయాన్ని ప్రజల్లో రేకెత్తిస్తున్నాయి. తాజాగా జోమాటోకి చెందిన ఓ డెలివరీ బాయ్.. ఫుడ్ డెలివరీకి వచ్చి కస్టమర్‌కు బలవంతంగా ముద్దు పెట్టాడు. మహారాష్ట్రలోని పూణె యెవలేవాడిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఓ యువతి జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టింది. ఆ ఫుడ్‌ను జొమాటో డెలివరీ మ్యాన్(42) తీసుకువచ్చాడు. ఫుడ్‌ను ఆమెకు ఇచ్చాక కొన్ని మంచినీరు కావాలని ఆడిగాడు. దాంతో యువతి అతనికి మంచినీరు తీసుకువచ్చి ఇచ్చింది. ఈ సమయంలో యువతితో అతను మాటలు కలిపాడు. ఇంట్లో ఎవరున్నారు? ఏం చేస్తుంటారు? అని ఆరా తీశాడు. ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న జోమాటో మ్యాన్.. మరో గ్లాస్ వాటర్ కావాలని కోరాడు. దాంతో యువతి వాటర్ తీసుకువచ్చేందుకు ఇంట్లోకి వెళుతూ వెనక్కి తిరిగింది. అదే ఛాన్స్‌గా భావించిన జొమాటో మ్యాన్‌.. అమ్మాయిని బలవంతంగా పట్టుకుని చెంపలపై ముద్దు పెట్టాడు. తాను చేసిన చర్యను కవర్ చేసుకోవడానికి తాను మామయ్య లాంటివాడినని, ఏ అవసరం ఉన్నా తనకు కాల్ చేసి చెప్పొచ్చని అమ్మాయికి చెప్పాడు. అతని చర్యతో షాక్ అయిన అమ్మాయి.. వెంటనే అతన్ని బయటకు పంపించి తలుపులు వేసుకుంది. అయితే, అంతటితో సమస్య ముగిసిందనుకుంటే.. జోమాటో మ్యాన్ మళ్లీ ఆ అమ్మాయి వాట్సప్‌కు మెసేజ్‌లు చేయడం ప్రారంభించాడు. దాంతో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న యువతి.. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. జొమాటో డెలివరీ మ్యాన్‌పై ఫిర్యాదు చేసింది. జరిగిన విషయాన్ని పేర్కొంటూ కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..