ఒడిశా అసెంబ్లీ ముందే తల్లిపై కొడుకు హత్యాయత్నం

ఒడిశా అసెంబ్లీ ముందు గురువారం ఓ షాకింగ్ ఘటన జరిగింది.  ఓ యువకుడు తన తల్లి పైనే హత్యాయత్నానికి దిగాడు. ఆమె మెడపై కత్తి పెట్టి చంపుతానంటూ బెదిరించాడు. ఈ తల్లీ కొడుకులు..

ఒడిశా అసెంబ్లీ ముందే తల్లిపై కొడుకు హత్యాయత్నం
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 01, 2020 | 9:45 PM

ఒడిశా అసెంబ్లీ ముందు గురువారం ఓ షాకింగ్ ఘటన జరిగింది.  ఓ యువకుడు తన తల్లి పైనే హత్యాయత్నానికి దిగాడు. ఆమె మెడపై కత్తి పెట్టి చంపుతానంటూ బెదిరించాడు. ఈ తల్లీ కొడుకులు ఓ ఆటోలో వెళ్తున్నారని, ఆటో అసెంబ్లీ ముందుకు రాగానే ఈ యువకుడు ఆటోను ఆపి అందులోంచి తల్లిని లాగి ఇలా ఆమెను బెదిరించాడని పోలీసులు తెలిపారు. అయితే మతి స్థిమితం లేని తన కొడుకును ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా ఇలా చేశాడని ఆ తల్లి తెలిపింది. ప్రభుత్వంలో కొందరు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కూడా ఆ యువకుడు కేకలు పెట్టాడని పోలీసులు ఆచెప్పారు. మొత్తానికి అతని బారి నుంచి ఆ తల్లిని వారు రక్షించారు.