బంగారం చోరీ చేసి.. ప్రియుడితో కలిసి జల్సాలు చేసి.. అసలు ట్విస్ట్ ఏంటో తెలిస్తే షాక్
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి దొంగతనం(Theft) కేసులో అరెస్టైంది. ఓ యువకుడిని ప్రేమించిన ఆమె.. కుటుంబసభ్యుల వ్యతిరేకతతో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది...
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి దొంగతనం(Theft) కేసులో అరెస్టైంది. ఓ యువకుడిని ప్రేమించిన ఆమె.. కుటుంబసభ్యుల వ్యతిరేకతతో ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలో ప్రియుడితో కలిసి జల్సాలకు అలవాటు పడింది. అక్రమ మార్గంలో డబ్బు సంపాందించేందుకు దొంగతనం చేసింది. తన గది పక్కనే ఉంటున్న మహిళ రూమ్ నుంచి బంగారాన్ని చోరీ చేసింది. నగలను అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేసింది. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులకు చిక్కి, కటకటాలపాలైంది. తమిళనాడు విల్లుపురం జిల్లాలోని సెంజి ఆలంపూండి గ్రామానికి చెందిన మాధవి పుదుచ్చేరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. ఈ నెల 18న తన బంధువుల ఇంట్లో జరిగిన వివాహానికి హాజరయ్యారు. పెళ్లిలో వేసుకున్న నగలను గదిలోని లాకర్‌లో భద్రపరిచి విధులకు వెళ్లారు. సాయంత్రం వచ్చి చూడగా నగలు కనిపించకపోవడంతో ఉరులైయన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు.
మాధవి గది పక్కనే ఉండే శివప్రతిక అనే యువతిని విచారించారు. ఆమె గదిలో గాలించి కొన్ని నగలను స్వాధీనం స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని నగలను విక్రయించి, వచ్చిన డబ్బును తన ప్రియుడితో కలిసి జల్సాలకు ఖర్చు చేసింది. శివప్రతిక ను పోలీసులు అదుపులోకి తీసుకుని, అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో శివప్రతిక తమిళనాడు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైనట్టు తెలిసింది. అంతేకాకుండా, పుదుచ్చేరి పోలీస్ శాఖ నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లోనూ ఉత్తీర్ణులైంది. శివప్రతిక ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం కుటుంబసభ్యులకు తెలిసింది. వారు వీరి ప్రేమను వ్యతిరేకించారు. దీంతో తల్లిదండ్రులను వదిలి వచ్చిన శివప్రతిక లేడీస్ హాస్టల్‌లో ఉంటూ పోలీస్ ఉద్యోగం కోసం సిద్ధమైంది. అయితే చోరీ కేసులో పట్టుబడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
పగబట్టిన పాము.. సినిమా సీన్ ను తలపించేలా.. విషయం తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు
Relationship: కొత్తగా పెళ్లైన జంటలు ఈ 4 విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి.. అవేంటంటే..?