Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌ తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ నివాసం నుంచి నెల్లూరుకు తరలిస్తున్నారు.

Goutham Reddy: ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం తరలింపు
Gouthamreddy
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 22, 2022 | 11:30 AM

AP Minister Mekapati Goutham Reddy: నెల్లూరు(Nellore) రోదిస్తోంది. గుండెలవిసేలా రోదిస్తోంది. అభిమాన నేత హఠాన్మరాణాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఎదురుచూస్తోంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) తరలించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్ నివాసం నుంచి అంబులెన్స్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు తరలించారు. అంబులెన్స్‌లో గౌతంరెడ్డి భౌతికకాయంతో పాటు తల్లి మణిమంజరి, సతీమణి శ్రీకిర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌ పోర్ట్ నుంచి నేవీ హెలీకాప్టర్‌లో గౌతమ్‌ రెడ్డి డెడ్‌బాడీని తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక నేవీ హెలికాప్టర్‌లో ఉదయం 11:25 గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డులోని క్యాంప్ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకునే అవకాశం ఉంది. ఉదయం 11:30 నుంచి అభిమానుల సందర్శనార్థం గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని ఉంచనున్నారు. అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి రాత్రి 11 గంటల ప్రాంతంలో నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాసేపట్లో పార్ధివదేహం నెల్లూరు చేరుకోనుంది. ఇంటి దగ్గర గౌతమ్‌ రెడ్డి భౌతికకాయం కోసం అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, బంధువులు ఎదురుచూస్తున్నారు.

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలకు సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అప్పగించారు. భౌతికకాయాన్ని బేగంపేట విమానాశ్రయానికి చేర్చిన అనంతరం నెల్లూరు జిల్లా క్యాంపు కార్యాలయానికి మంత్రి ఆదిమూలపు సురేష్ రోడ్డు మార్గంలో బయలుదేరారు. రాజకీయాల్లో అజాతశత్రువుగా పేరొందిన గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని చూసేందుకు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలి రానుండటంతో అందుకు తగ్గట్లు అక్కడి ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు జిల్లా వైఎస్సా్‌సీపీ అధ్యక్షుడు కాకాణి పర్యవేక్షిస్తున్నారు.

కాసేపట్లో నెల్లూరు చేరుకోనుంది నేవీ హెలీకాప్టర్. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఏర్పాట్లు చేశారు. రాత్రికి గౌతమ్‌రెడ్డి కుమారుడు నెల్లూరు చేరుకుంటాడు. రేపు ఉదయగిరిలో అధికార లాంఛనాలతో నిర్వహించే అంత్యక్రియలకు సీఎం జగన్‌, మంత్రులు, ప్రముఖులు హాజరవుతారు. అధికార లాంఛనాలతో నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించగా.. ఉదయగిరి మెరిట్ ఇంజనీరింగ్ కాలేజీలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు ఇన్‌చార్జి మంత్రి హోదాలో అంతిమ సంస్కారాల పనులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
బయట కొనడం కంటే ఇంట్లోనే బేబీ ఆయిల్ తయారు చేసుకోవచ్చు..
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
తెలంగాణ వాసులకు అలర్ట్.. ‘స్థానికత’ కష్టాలకు కమిటీ నియామకం!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
నిమ్మరసంలో ఈ గింజలు కలిపి తాగితే షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే!
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
టేస్టీ అండ్ హెల్దీ పన్నీర్ నగేట్స్.. ఏ టైమ్‌లో అయినా అదిరిపోతాయి
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపునకు డేట్ ఫిక్స్.. ఎప్పటి నుంచంటే
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
మంచు దుప్పటి కప్పుకున్న కశ్మీరం.. రైల్వే ట్రాకులపై భారీగా మంచు
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
నిరుద్యోగులకు బలేఛాన్స్.. DEETలో ప్రైవేటు ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..
పేద స్నేహితుడి కుమార్తె పెళ్లికి డబ్బు సాయం.! పూర్వ విద్యార్థలు..