AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగబట్టిన పాము.. సినిమా సీన్ ను తలపించేలా.. విషయం తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..

పాము పగబట్టటం, ఒకరి తర్వాత ఒకరిని కాటేయటం లాంటి కథాంశంతో చాలానే సినిమాలు చూసి ఉంటాం. కాలీ రీల్ లో జరిగినట్లు రియల్ లో జరుగుతుందా అంటే జరగదనే..

పగబట్టిన పాము.. సినిమా సీన్ ను తలపించేలా.. విషయం తెలిస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే..
Snake
Ganesh Mudavath
|

Updated on: Feb 22, 2022 | 1:15 PM

Share

పాము పగబట్టటం, ఒకరి తర్వాత ఒకరిని కాటేయటం లాంటి కథాంశంతో చాలానే సినిమాలు చూసి ఉంటాం. కాలీ రీల్ లో జరిగినట్లు రియల్ లో జరుగుతుందా అంటే జరగదనే అంటారు చాలామంది. కానీ అచ్చం సినిమాల్లో చూపించినట్లే రియల్ లోనూ ఓ ఘటన  జరిగింది. సినిమాల్లో చూపించినట్లు ఓ పాము ఒక కుటుంబాన్ని పగబట్టిన రీతిలో వ్యవహరించింది. ఇదిలా ఉంటే అసలు నాగుపాము పగ పడుతుందా.? పగబట్టి వెంటాడుతుందా.? వెంటాడి కాటేస్తుందా.? ఇవి సమాధానాలు లేని ప్రశ్నలు. వీటికి కొంతమంది అవునని అంటారు. మరికొందరు కొట్టిపారేస్తారు. అయితే చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఓ కుటుంబాన్ని పాము పగబట్టినట్లుగా.. ఒకే నెలలో ఆరు సార్లు కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలిస్తుండటంతో ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం డోర్ణకంబాల గ్రామానికి చెందిన వెంకటేష్, వెంకటమ్మ దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు జగదీష్ ఉన్నాడు.​వెంకటేష్ కుటుంబం గ్రామానికి చివరన ఉన్న కొండ వద్ద నివాసముంటున్నారు. గత నెలలో వెంకటేష్, వెంకటమ్మ, జగదీష్​లను రెండేసి సార్లు పాము కాటేసింది. స్థానికులు సకాలంలో స్పందించి 108 కాల్ చేసి.. ఆసుపత్రికి తరలించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన వెంకటమ్మ, జగదీష్​లను సోమవారం తెల్లవారుజామున మళ్లీ పాము కాటేసింది. మళ్లీ స్థానికులు 108కి కాల్ చేసి.. తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read

అది అందరికీ తెలిసిందే కదా.. కాంగ్రెస్ నేత వీహెచ్ – సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ

లిచీ పండ్ల‌తో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు.

Viral Video:  ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది..