అది అందరికీ తెలిసిందే కదా.. కాంగ్రెస్ నేత వీహెచ్ – సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ
కాంగ్రెస్ నేత వీహెచ్ - సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ.. అది అందరికీ తెలిసిందే కదా అని ఛలోక్తి తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో అవాస్తవాలను..
కాంగ్రెస్ నేత వీహెచ్ – సీపీ సీవీ అనంద్ సరదా సంభాషణ.. అది అందరికీ తెలిసిందే కదా అని ఛలోక్తి తాను పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో అవాస్తవాలను వైరల్(Viral) చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు(Hanumanta rao) పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తాను కలిసినట్లుగా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి, దానిపై పార్టీ మారుతున్నట్లు వ్యాఖ్యల్ని జోడించారని హైదరాబాద్ సైబర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) కు ఫిర్యాదు అందజేశారు. పల్స్ ఆఫ్ తెలంగాణ పేరిట వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల్లో తాను తెరాసలో చేరుతున్నట్లు, జగ్గారెడ్డితో కలిసి సీఎం కేసీఆర్‌తో ఉన్నట్లుగా చిత్రాన్ని మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని వివరించారు.
వీహెచ్ ఫిర్యాదుపై సీపీ సీవీ ఆనంద్ స్పందించారు. మార్ఫింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటామన్నారు. కానీ ప్రచారంలో ఏమైనా నిజం ఉందా, మీ మనసులో ఏముంది అని సరదాగా ప్రశ్నించారు. దీనిపై వీహెచ్.. మార్ఫింగ్ అవతలి పార్టీ వాళ్లు చేశారో, మా పార్టీ వాళ్లు వేశారో తెలియడం లేదని చమత్కరించారు. ఇవ్వాళ రేపు అవతలి పార్టీ వాళ్లకన్నా మా పార్టీ వాళ్లతోనే డేంజర్ గా ఉందన్నారు. అది అందరికీ తెలుసుగా? మీకు అపొజిషన్ అవసరం లేదని సీపీ ఛలోక్తి విసిరారు.
ఇదీ సంభాషణ..
వీహెచ్: డ్రగ్స్‌పై తీసుకుంటున్న చర్యలు చరిత్రాత్మకం. యువత మత్తుకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటోంది. నేను ఏటా నిర్వహించే జాతీయస్థాయి క్రికెట్ పోటీలను ఈనెల 24న హాజరై ప్రారంభించాలి. సీపీ: వస్తా.. ఇంతకీ ఎవరిపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. నాపైనా.. నేనేమైనా చేశానా.. లేక మావాళ్లు ఏమైనా చేశారా..? వీహెచ్: ఎవరో గిట్టనివారు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. తెరాసలో చేరినట్లు, కండువా వేసుకుంటున్నట్లు చిత్రాన్ని మార్ఫింగ్ చేశారు. సీపీ: మార్ఫింగ్ కేసా.. దీన్ని సీరియస్‌గా తీసుకుంటాం. ఇంతకీ వారు రాసిన వ్యాఖ్యల్లో ఏమైనా నిజముందా.., మీ మనసులో అలాంటి ఆలోచన ఉందా..? వీహెచ్: మా పార్టీలోనే డేంజర్ ఉంది. మాలోనే ప్రతిపక్షం ఉంది. సీపీ: అది అందరికీ తెలిసిందే కదా.. మీకు మరో ప్రతిపక్షమే అక్కరలేదు.
Also Read
Kili Paul: ఇంటర్నెట్ సంచలనం కిలీ పాల్‌కు అరుదైన గౌరవం.. సత్కరించిన భారత హైకమిషన్
Stock Market: యుద్ధ భయాలతో పతనమవుతున్న స్టాక్ మార్కెట్లు.. బేరు మంటున్న ఇన్వెస్టర్లు..
Viral Video: ట్రయల్ రూమ్‌లో వింత శబ్దాలు.. తీరా వెళ్లి చూస్తే మైండ్ బ్లాంక్ అయ్యింది..