ఏవోబీలో మావోయిస్టు డంప్.. ఆయుధాలు చూసి పోలీసులు షాక్.. ఇంతకీ ఏమేం ఉన్నాయంటే..
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలను బహిష్కరించాలని...
ఆంధ్రా – ఒడిశా సరిహద్దులో మావోయిస్టుల భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో కటాఫ్ ఏరియాలో పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. నిఘా వర్గాలకు అందిన సమాచారం ఆధారంగా.. ఎస్‌వోజీ, డీవీఎఫ్ బలగాలు అప్రమత్తమయ్యాయి. అడవిలో అణువణువూ గాలిస్తున్నారు. ఈ క్రమంలో మల్కాన్ గిరి జిల్లా జంత్రి పంచాయతీ పరిధిలోని నడిమెంజరీ అటవీప్రాంతంలో.. మావోయిస్టులు దాచి ఉంచిన భారీ డంప్‌ను గుర్తించారు.
ఈ డంప్‌లో నాలుగు దేశవాళీ తుపాకీలు, టిఫిన్ బాంబు, ప్రెషర్ ఐఈడీ, ఒక రివాల్వర్, డిటోనేటర్లు, వాకీ టాకీ, 42 మీటర్లు కోడెక్స్ వైర్‌తో పాటు మైన్స్ తయారీకి ఉపయోగించే పేలుడు సామగ్రి, విప్లవ సాహిత్యం, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంపును ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీకి చెందిందిగా గుర్తించారు. అనంతరం కూంబింగ్ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో స్థానిక ఎన్నికల ప్రశాంతంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఒడిశా పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి.
Sand War: మీరా.. మేమా..? రెండు గ్రామాల మధ్య ఇసుక వార్.. తలపట్టుకుంటున్న అధికారులు
కలెక్టర్‌కు ఫోన్ చేసి షాకిచ్చిన మద్యం ప్రియుడు.. అతని కోరిక వింటే అవాక్కవ్వాల్సిందే..
Viral Video: చిరుతతో ఆటలా !! తృటిలో తప్పించుకున్నాడు !! వీడియో