Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై కేసు.. ఎందుకో తెలుసా..?
Chintakayala Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Chintakayala Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 18న నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu).. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan) ని అసభ్యపదజాలంతో దూషించారని స్థానిక వైసీపీ నేత రామకృష్ణ నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు.. టీడీపీ (TDP) నేత అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 153A, 505/2, 506 కింద ఈ కేసు నమోదు చేశారు.
కాగా.. అయ్యన్న చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అయ్యన్న నీ స్థాయి తెలుసుకో అంటూ వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వార్నింగ్ ఇచ్చారు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తానంటూ ధ్వజమెత్తారు. గతంలో బట్టిలిప్పు రికార్డింగ్ డ్యాన్స్ వేశారు గుర్తుందా అంటూ ఘాటుగా విమర్శించారు. తమ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం అంటూ తలారి పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. గతంలో గుంటూరు జిల్లాలో దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ వర్ధంతి సభలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది వేముల ప్రసాద్ చేసిన ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
Also Read: