Kerala Love Murder: ప్రియుడ్ని చంపిన యువతి కేసులో ట్విస్ట్.. స్టేషన్​లోనే విషం తాగిన నిందితురాలు..

|

Oct 31, 2022 | 11:01 PM

కేరళ ప్రియుడు మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యువకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి గ్రీష్మ పోలీస్ స్టేషన్‌లో విషయం తాగింది.

Kerala Love Murder: ప్రియుడ్ని చంపిన యువతి కేసులో ట్విస్ట్.. స్టేషన్​లోనే విషం తాగిన నిందితురాలు..
Tamil Nadu Girl
Follow us on

కేరళ ప్రియుడు మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. యువకుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువతి గ్రీష్మ పోలీస్ స్టేషన్‌లో విషయం తాగింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. యువతిని ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందడంతో యువతిని కాపాడారు వైద్యులు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు, పోలీసులు తెలిపారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

కేరళకు చెందిన షరోన్‌, తమిళనాడులోని రామవర్మంచిర్‌కు చెందిన గ్రీష్మ ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇంతలో మంచి సౌండర్ పార్టీ సంబంధం కుదరడంతో ఆ అమ్మాయి.. తన ప్రియుడిని వదిలించుకోవాలనుకుంది. ఇంతలో బాంబ్ పేల్చాడు జ్యోతిష్యుడు. అమ్మాయికి పెళ్లి చేస్తే మొదటి భర్త చనిపోతాడంటూ చావుకబురు చల్లగా చెప్పాడు. మూడు ముళ్లు పడగానే పెనిమిటి పుటుక్కున పోతాడని హడలగొట్టాడు. పరిహారంగా జోస్యుడు ఏం చెప్పాడోకానీ.. సకుటంబ సమేతంగా మాస్టార్‌ ప్లానేశారు యువతి, ఆమె పేరెంట్స్‌.

మొదటి మొగుడు పోతే పోనీ.. రెండో వాడే కదా మనకు ఇంపార్టెంట్‌. ప్రియుడిని పెళ్లి చేసుకుంటే.. అతను ఫుటుక్కుమంటాడు. అతనితో ఇన్నాళ్లు షికార్లు చేసిన ప్రేమ చరిత్ర ఖతమైపోతుందనేది వాళ్ల ప్లాన్‌. ఆ ప్రకారంగా ఇంటిల్లిపాది సదరు ప్రేమికుడిని ట్రాప్‌ చేశారు. పెళ్లి జరిపించారు. మంగళ్య బంధన్‌ ఘట్టం సంపూర్ణమైంది. కానీ రోజులు గడుస్తున్నా బంధం ధృడపడుతుందోకానీ తాళి తెగే సన్నివేశం రావడంలేదు. ఇతను పోతేనే కదా అతన్ని పెళ్లి చేసుకునేది. అంతే ఆపరేషన్‌ పెనిమిటి ఎలిమినేషన్‌ను పట్టాలెక్కించారు. మాంగళ్యం తంతునామేనా బంధాన్ని బ్రేక్‌ చేసేందుకు కషాయంలో విషం కలిపి తంతు షురు చేశారు. ఒక్కసారిగా ఎక్కువ మోతాదు ఇస్తే.. అతను చస్తే డౌట్‌ వస్తుంది కాబట్టీ దశలవారీగా విషం ఇస్తూ వెళ్లారు. వీళ్లు తమక కుట్రను తాము చేసుకెళ్లారు. విషం తన పని తాను చేసుకెళ్లింది. కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన ప్రియుడు షరోన్‌.. చివరకు చనిపోయాడు.

ఇవి కూడా చదవండి

ఈనె 14వ తేదీన తమిళనాడులోని రామవర్మంచిర్‌లో ప్రియురాలు గ్రీష్మ ఇంటికి వెళ్లాడు షరోన్‌. . గ్రీష్మ, షరోన్‌ లు జ్యూస్ తాగే పోటీ పెట్టుకున్నారు. అయితే షరోన్‌ తాగే జ్యూస్‌లో కాపర్ సల్ఫేట్ కలిపింది గ్రీష్మ. అది తాగిన షరోన్ అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. తరువాత ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషం తాగిన కారణంగానే షరోన్‌ మృతి చెందినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. కేరళ తిరువనంతపురంలోని పరశాలలో షరోన్‌ కటుంబంలో విషాదం నెలకొంది. గ్రీష్మ ఆమె పేరెంట్స్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు షరోన్‌ కుటుంబసభ్యులు. వాళ్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే.. పాయిజన్‌ కుట్ర కథ మొత్తం రివీలైంది.

అయితే, పోలీసుల కస్టడీలో ఉన్న ఆ యువతి.. తాను కూడా విషయం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు అప్రమత్తంగా ఉండటంతో ఆమె బతికిబట్టకట్టింది. లేదంటే యువతి కూడా ప్రియుడు చెంతకే చేరేదంటున్నారు స్థానికులు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..