Viral: బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..

|

Dec 18, 2022 | 2:54 PM

ఒత్తిడికి గంజాయే మెడిసిన్ అట. అలా చెప్పడమే కాదు ఏకంగా గంజాయిని స్మగ్లింగ్​ చేస్తూ దొరికిపోయాడు ఓ యోగా టీచర్​. ఆ వివరాలు మీ కోసం.

Viral: బస్టాండ్‌లో బ్యాగ్‌తో అనుమానాస్పదంగా యోగా ట్రైనర్.. అదుపులోకి తీసుకుని చెక్ చేయగా..
Yoga Teacher Dinesh
Follow us on

అతనో యోగా ట్రైనర్. అది అతని వృత్తి. ఇది పై పై కలరింగ్ జాబే. అసలు యాపారం వేరే ఉంది. మత్తును  గట్టు దాటించడంలో ఆరితేరాడు. కానీ తప్పుడు పనులకు ఎప్పుడో ఒకప్పుడు శిక్ష తప్పదు. తాజాగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.  చెన్నైలో ఓ యోగా ట్రైనర్​ గంజాయిని స్మగ్లింగ్​ చేస్తూ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పెరుంగళత్తూరులో  శుక్రవారం మార్నింగ్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. కేరళకు చెందిన దినేశ్.. పెద్ద బ్యాగ్‌తో అక్కడక్కడే తిరగడంతో పోలీసులకు డౌట్ వచ్చింది. వెంటనే అదుపులోకి తీసుకుని వివరాలు సేకరించారు. బ్యాగ్ తనిఖీ చేయగా గంజాయి బాగోతం బయటపడింది. నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు.

అంతటితో ఆగలేదు. వ్యాపారం లాభదాయంకంగా ఉండటంతో.. తానే గంజాయి సప్లై చేయడం మొదలెట్టాడు. తానే ఒక స్మగ్లర్‌ మారి గంజాయిని అక్రమ రవాణా చేయడం షురూ చేశాడు. ఈ క్రమంలోనే చెన్నైలో పోలీసులకు పట్టుబడ్డాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..