బెంగళూరు ఘర్షణల ఎఫెక్ట్‌.. “ఎస్‌డీపీఐ,పీఎఫ్ఐ”లపై నిషేధం..?

ఇటీవల బెంగళూరులో జరిగిన ఘర్షణల గురించి తెలిసిందే. మంగళవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మూకదాడి చేసి.. అనేక వాహనాలను ధ్వంసం చేసిన సంగతి..

బెంగళూరు ఘర్షణల ఎఫెక్ట్‌.. ఎస్‌డీపీఐ,పీఎఫ్ఐలపై నిషేధం..?
Follow us

| Edited By:

Updated on: Aug 15, 2020 | 4:40 PM

ఇటీవల బెంగళూరులో జరిగిన ఘర్షణల గురించి తెలిసిందే. మంగళవారం నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ఓ వర్గానికి చెందిన వ్యక్తులు మూకదాడి చేసి.. అనేక వాహనాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. బాధిత ఎమ్మెల్యే మేనల్లుడు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌ కారణంగా ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే అల్లరి మూకలు పక్కా స్కెచ్‌ వేసి ఈ దాడులకు దిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్పోరేటర్‌ భర్తతో పాటుగా.. సోషల్ డెమోక్రెటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఏకంగా పోలీసు స్టేషన్‌పై రాళ్ల వర్షం కురిపించడంతో పాటు.. దాదాపు అరవై మంది పోలీసులను గాయపరిచారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు.

అయితే ఈ ఘర్షణలు జరగడానికి ఎస్డీపీఐ ముఖ్య కారణంగా తేలడంతో ఈ సంస్థను నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర హోం మంత్రి ఈ ఘటనలో ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఘర్షణల్లో ఎస్‌డీపీఐ పార్టీ హస్తం ఉందని తేలిపోవడంతో పాటుగా.. మరికొన్ని కారణాలు కూడా ఉండటంతో పార్టీపై నిషేధం విధిస్తామని మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన జరగబోయే కేబినెట్‌ మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు