Cyclone Yaas: ఏడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్ తుఫాను , బెంగాల్ కోస్తా జిల్లాల్లో బీభత్సం, రంగంలోకి నేవీ సైన్యం…

యాస్ తుఫాను ఏడు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగాపశ్చిమ బెంగాల్ కోస్తా జిల్లాలకు అపార నష్టం కల్గించింది. పూర్బా మెడిని పూర్ , సౌత్ 24 పరగణాల జిల్లాలు ఈ తుఫానుతో అతలాకుతలమయ్యాయి.

Cyclone Yaas: ఏడు రాష్ట్రాలను వణికిస్తున్న యాస్ తుఫాను , బెంగాల్ కోస్తా జిల్లాల్లో బీభత్సం,  రంగంలోకి నేవీ సైన్యం...
Yaas Cyclone

Edited By: Anil kumar poka

Updated on: May 26, 2021 | 3:54 PM

Cyclone Yaas: యాస్ తుఫాను ఏడు రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగాపశ్చిమ బెంగాల్ కోస్తా జిల్లాలకు అపార నష్టం కల్గించింది. పూర్బా మెడిని పూర్ , సౌత్ 24 పరగణాల జిల్లాలు ఈ తుఫానుతో అతలాకుతలమయ్యాయి. ఈ జిలాల్లో సముద్రపుటలలు ఎగసిపడుతున్నాయి. కోల్ కతా లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బుధవారం రాత్రి ఏడున్నరగంటలవరకు మూసివేశారు. బెంగాల్ లో 11,5 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనేక చోట్ల వంతెనలు కూలిపోయాయి. గంటకు 100 నుంచి 110 కి.మీ.వేగంతో వీచిన పెను గాలులలకు భారీ వృక్షాలు నేలకూలగా …వేలాది ఇళ్ళు దెబ్బ తిన్నాయి.హల్దియా పోర్టును తాత్కాలికంగా మూసివేశారు.సహాయక చర్యలకు నేవీ, సైన్యాన్ని సిద్ధంగా ఉంచారు. ఒడిశాలో సుమారు 6 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు. భువనేశ్వర్ ఎయిర్ పోర్టును రేపు ఉదయం వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. . ఇక బీహార్, సిక్కిం, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చునని వాతావరణ శాఖ అంచనా
వేసింది. ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఈ సాయంత్రానికి తుఫాను తాకవచ్చునని, ఫలితంగా ఇక్కడ కూడా ఒక మోస్తరు నుంచి భారీ లేదా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి, ఒడిశా లోని బాలాసోర్ వద్ద ఈ సాయంత్రానికి తుపాను తీరం దాటవచ్చునని భావిస్తున్నారు. ఫలితంగా పెనుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చునని అధికారులు తెలిపారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Radhe Movie : సల్మాన్ రాధే మూవీ సరికొత్త రికార్డు.. 65 దేశాల్లో అందుబాటులోకి రానున్న సినిమా..

వూహాన్ ల్యాబ్ లో అసలు ఏం జరిగింది ? కోవిద్ వైరస్ పుట్టుకపై రెండో దశ ఇన్వెస్టిగేషన్ జరగాల్సిందే, అమెరికా పిలుపు,