Wrestlers Protest: రెజ్లర్ల దీక్షకు ప్రియాంక గాంధీ మద్ధతు.. నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారంటూ ఫైర్..

|

Apr 29, 2023 | 11:51 AM

ఢిల్లీలో రెజ్లర్ల దీక్షకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ.. వారి నిరసనపై ఆందోళన వ్యక్తం చేశారు. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో ఎవరికీ తెలియదన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు చూపించడం లేదంటూ ప్రియాంక ప్రశ్నించారు. మల్లయోధులు పతకాలు సాధించినప్పుడు ట్వీట్లు చేసి గర్వంగా ఫీలయ్యామని

Wrestlers Protest: రెజ్లర్ల దీక్షకు ప్రియాంక గాంధీ మద్ధతు.. నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారంటూ ఫైర్..
Priyanka Gandhi
Follow us on

ఢిల్లీలో రెజ్లర్ల దీక్షకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ మద్దతు తెలిపారు. రెజ్లర్లకు సంఘీభావం తెలిపిన ప్రియాంక గాంధీ.. వారి నిరసనపై ఆందోళన వ్యక్తం చేశారు. నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో ఏముందో ఎవరికీ తెలియదన్నారు. ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు చూపించడం లేదంటూ ప్రియాంక ప్రశ్నించారు. మల్లయోధులు పతకాలు సాధించినప్పుడు ట్వీట్లు చేసి గర్వంగా ఫీలయ్యామని, ఇప్పుడు మాత్రం మొహం చాటేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిజ్ భూషణ్‌ను ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో అర్థం కావడం లేదన్నారు. దేశం మొత్తం రెజ్లర్లకు అండగా నిలుస్తుందని ప్రియాంక గాంధీ అన్నారు.

సుప్రీంకోర్టులో విచారణ..

మరోవైపు రెజ్లర్ల పిటిషన్‌పై నిన్న సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌పై విచారణ చేశారు. మే 5వ తేదీన మరోసారి విచారణ చేస్తామని చెప్పారు. ఆలోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిరసన చేస్తున్న రెజ్లర్ల భద్రతకు బాధ్యత తీసుకోవాలని సుప్రీం సూచించింది. దర్యాప్తు డాక్యుమెంట్ల విషయంలోను గోప్యత పాటించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్ట్ చేసేవరకు దీక్ష కొనసాగిస్తామని చెప్పారు రెజ్లర్లు.దీంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల దీక్ష కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..