సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం.. కీలక సూచనలు చేసిన నిపుణులు

| Edited By: Aravind B

Sep 10, 2023 | 2:01 PM

మనిషి పుట్టినప్పటి నుండి తన జీవితంలో ఏదొక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి... ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకొని లేనిపోని నిర్ణయాలను తీసుకుంటున్నారు కొందరు. ఇలా చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు వరకు వెళ్ళి నిండు జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. తమకు ఎదురైన సమస్యను తెలుసుకొని దానిని అధిగమించే మార్గాలను వెతుకుంటే సమస్య కన్నా పరిష్కర మార్గాలే ఎక్కువగా కనిపిస్తాయి.

సెప్టెంబర్ 10 ఆత్మహత్యల నివారణ దినోత్సవం.. కీలక సూచనలు చేసిన నిపుణులు
Representative Image
Follow us on

మనిషి పుట్టినప్పటి నుండి తన జీవితంలో ఏదొక సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాడు. కానీ వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కోవాలి… ఎలా పరిష్కరించుకోవాలి అనేది తెలిసి ఉండాలి. చిన్న చిన్న విషయాలను మనసుకు తీసుకొని లేనిపోని నిర్ణయాలను తీసుకుంటున్నారు కొందరు. ఇలా చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు వరకు వెళ్ళి నిండు జీవితాలను అర్థాంతరంగా ముగిస్తున్నారు. తమకు ఎదురైన సమస్యను తెలుసుకొని దానిని అధిగమించే మార్గాలను వెతుకుంటే సమస్య కన్నా పరిష్కర మార్గాలే ఎక్కువగా కనిపిస్తాయి. వచ్చిన సమస్య పెద్దదిగా భావిస్తే విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ మధ్యకాలంలో వివిధ కారణాలతో ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు విపరీతంగా పెరిగిపోయాయి. కారణం ఏదైనా చావు ఒకటే దిక్కు అని అర్థంతరంగా జీవితాన్ని ముగిస్తున్నారు.

ఇలా వివిధ కారణాలతో తల్లిదండ్రులు పిల్లలను ఒంటరి వాళ్లను చేస్తుంటే చిన్నతనంలోనే పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్నీ మిగుల్చుతున్నారు. హాస్టల్ లో ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక కార్తిక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు. కన్నా కలల్ని సహాకారం చేస్తాడు అని భావించిన కార్తిక్ తల్లిదండ్రులు.. ఆ కలలు నెరవేరకుండానే తనువు చాలించాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఇప్పటికి కొలుకోలేకపోతున్నారు. తాజాగా ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మధ్య మనస్పర్థలు రావడంతో తరుచూ గొడవలు పడుతున్నారు. ఆ గొడవలు కాస్త ఒకరు ఆత్మహత్య చేసుకునేవరకు వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన లో శ్రీయరెడ్డి, సాయి కిరణ్ సంవత్సరన్నార క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరికి ఎప్పుడు గొడవలు వచ్చిన ఇద్దరు సూసైడ్ నోట్ లను రాసుకునే వారు. అలా శనివారం సెలవు కావడం తో షాపింగ్ విషయం లో ఇద్దరి మధ్య గొడవ మొదలు అయింది. దింతో మాట మాట పెరగి గదిలోకి వెళ్లిన సాయి కిరణ్ ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మరోవైపు భార్యాభర్తల గోడవలలో ఎవరో ఎవరు ఇలాంటి నిర్ణయం తీసుకున్న పిల్లలు అనాథలుగా మారుతున్నారు.

అయితే మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి అని నిపుణులు అంటున్నారు. మనస్థాపంలో ఉన్న వ్యక్తి వేరే వారికి అయిన వ్యక్తులకు విషయాన్ని చెప్పుకుంటే సగం భారం తగ్గుతుంది అంటున్నారు. డిప్రెషన్ లో ఉన్న వ్యక్తులను గమనించి వైద్యుల వద్ద చికిత్స, కౌన్సెలింగ్‌ అందిస్తే వారిని ఆత్మహత్యలకు పాల్పడకుండా కాపాడవచ్చు అంటున్నారు. మానసిక సంఘర్షణకు గురై, సహనం లేనటువంటి వారు క్షణికావేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించి కౌన్సెలింగ్‌ చేస్తే వారు ప్రాణాలు తీసుకోకుండా చూడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి