మిమ్మల్ని ఎవరు టచ్ చేసినా (మీపై దాడికి దిగినా) వెంటనే తిరగబడాలని కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కే.ఎస్. ఈశ్వరప్ప బీజేపీ కార్యకర్తలకు ‘పిలుపు నిచ్చారు’. ఒకరు కర్రతో కొడితే అదే కర్రతో వారిపై రెండిచ్చుకోండి”అన్నారు. ఇది ఆదేశం అనుకోండి అని వ్యాఖ్యానించారు. తన షిమోగా నియోజకవర్గంలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బీజేపీ గతంలో కన్నా ఇప్పుడు ఎంతో బలోపేతమైందని, మీరెవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. ఒకప్పుడు పొరుగున్న కేరళలో ఆర్ ఎస్ ఎస్ శాఖను ప్రారంభించడానికి ఎవరైనా వెళ్తే వారిని చంపేసేవారని.. అప్పుడు మనకు అంత శక్తి ఉండేది కాదని ఆయన చెప్పారు. సంయమనంతో వ్యవహారించాల్సిందిగా సంఘ్ పరివార్ పెద్దలు మనకు చెప్పేవారని, అందువల్ల మనం మౌనంగా ఉండిపోవాల్సి వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు బీజేపీ ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగిందని.. ప్రస్తుతం మనలను ఎదుర్కోవడానికి ఎవరికీ సాహసం లేదని ఈశ్వరప్ప అన్నారు. ఆ నాటి పరిస్థితి వేరని, ఇప్పటి పరిస్థితి వేరని ఆయన పేర్కొన్నారు.
కాగా ఈ మంత్రి ఇలా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని లేదా ఆయన రాజీనామా చేయాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అసలు ఈయన ఎమ్మెల్యే కావడమే గొప్ప అని, అలాంటిది మంత్రి అయ్యాక ఈ విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని సోషల్ డెమాక్రేటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఆరోపించింది. స్పీకర్ ఆయనను లెజిస్లేచర్ నుంచి సస్పెండ్ చేయాలని కోరింది. ఈశ్వరప్ప గతంలో కూడా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారని ఈ పార్టీ పేర్కొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: PM Modi: దేశ యువతకు స్ఫూర్తినిచ్చిన క్విట్ ఇండియా ఉద్యమం.. ప్రధాని మోదీ
Hyderabad: సెక్యూరిటీపై దాడి.. హైదరాబాద్ జువైనల్ హోమ్ నుంచి మైనర్లు ఎస్కేప్.. దొరకని ఆచూకి