Actor Vishal: నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. లేదంటే తప్పకుండా పార్టీ పెడతాః విశాల్

|

Apr 23, 2024 | 1:05 PM

పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి జనం ఆలోచించవద్దని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలకున్నట్లు ఆయన తెలిపారు. 2026లో తప్పకుండా రాజకీయ పార్టీ ప్రారంభిస్తానన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వవద్దని, ప్రజలకు పార్టీలు మంచి చేస్తే సినిమాలో నటించి వెళ్లిపోతానని విశాల్ స్పష్టం చేశారు.

Actor Vishal: నేను రాజకీయాల్లోకి రాకుండా చూసుకోండి.. లేదంటే తప్పకుండా పార్టీ పెడతాః విశాల్
Vishal
Follow us on

ప్రజల అవసరాలను తీర్చే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, తనలాంటి వారు ఎప్పుడూ ఓటర్లుగానే మిగిలిపోతారని సినీ నటుటు విశాల్‌ అన్నారు. రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలో దిగుతానని విశాల్‌ ప్రకటించారు. సేలం అమ్మపేటలోని శక్తి కైలాష్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ ఆర్ట్స్‌లో విశాల్ రాబోయే చిత్రం రత్నం ప్రమోషన్‌కు సంబంధించి జరిగిన కార్యక్రమంలో నటుడు విశాల్ పాల్గొన్నారు. అనంతరం మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు.

పార్టీతో పొత్తు టిక్కెట్ల కేటాయింపు గురించి జనం ఆలోచించవద్దని, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో పార్టీని ప్రారంభించాలకున్నట్లు ఆయన తెలిపారు. 2026లో తప్పకుండా రాజకీయ పార్టీ ప్రారంభిస్తానన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వవద్దని, ప్రజలకు పార్టీలు మంచి చేస్తే సినిమాలో నటించి వెళ్లిపోతానని విశాల్ స్పష్టం చేశారు.

తమిళనాడులో లోపాలు లేని చోటు లేదని ఆరోపించారు విశాల్.గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. తమిళనాడులో చాలా పార్టీలు, జెండాలు ఉన్నాయి. కానీ పేద ప్రజలకు మంచి ఏమీ జరగలేదు. రాజకీయాల్లో ఎవరు వచ్చినా ఏం చేయలేకపోతున్నారన్నారు. ఓటరుగా, సామాజిక కార్యకర్తగా నా ఆవేదనను తెలియజేస్తున్నానన్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే, ఏ పార్టీ అయినా ప్రజల ప్రాథమిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విశాల్ సూచించారు. ప్రజలు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాసుపత్రికి వెళుతున్నారు. ఎమ్మెల్యే ఎంపీల వంటి వారు వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ముతో ప్రభుత్వ ఆసుపత్రుల నాణ్యత పెరగకుండా కేవలం ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు.

అలాగే, తమిళనాడులో మార్పు రావాలి. ఈ ఏడాది చివరి నాటికి నటీనటుల సంఘం భవనం పూర్తవుతుంది. నటీనటుల సంఘ భవనానికి విజయకాంత్ పేరు పెట్టాలని నటీనటుల సంఘంలోని పెద్దలందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..