ఉత్తరప్రదేశ్ లో బ్లాకు పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు సన్నాహాలు చేస్తున్నారు.అయితే లక్నోకు సుమారు 150 కి.మీ. దూరంలోని లకిమ్ పురి ఖేరిలో గురువారం ఓ మహిళ తన నామినేషన్ వేయడానికి వెళ్తుండగా ఇద్దరు దుండగులు ఆమె చీరను లాగి ఆమెపై దాడికి యత్నించారు. అయితే అప్రమత్తంగా ఉన్న ఆమె వారి నుంచి తప్పించుకుంది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తోంది., ఈ ఎన్నికల నేపథ్యంలో రాష్టంలో సుమారు డజను చోట్ల ఘర్షణలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. 825 మంది బ్లాకు పంచాయతీలకు నాయకులను ఎన్నుకునేందుకు శనివారం ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే పలు చోట్ల పోలీసులను మోహరించారు. అయినా నేడు ఈ ప్రాంతంలో దుండగులు ఈ మహిళపై ఎటాక్ చేసేందుకు యత్నించారు. ఈ రాష్ట్రంలో చిన్న స్థాయి ఎన్నికలను కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈ కారణాల వల్లే గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి.
ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించగా సమాజ్ వాదీ పార్టీ 5 స్థానాలతో సరి పెట్టుకున్న విషయం గమనార్హం. కనీసం ఈ ఎన్నికల్లోనైనా బలపడాలని ఈ పార్టీ భావిస్తోంది. వచ్చే ఏడాది ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడే ఇలా పరిస్థితి ఉంటే అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: వారెవా ! ‘మందు కొట్టిన గేదెలు’..ముగ్గురు రైతులను అరెస్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే ?
లాహోర్ లో జరిగిన బాంబు దాడిపై పాకిస్తాన్ ఆరోపణలు పూర్తిగా నిరాధారం.. ఇండియా ఫైర్