Kedarnath Temple: కేదార్‌నాథ్ గర్భగుడిలో అపచారం.. శివలింగంపై నోట్లను చల్లిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో..

Kedarnath Temple: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఓ మహిళ అపచారానికి పాల్పడింది. కోట్లాది మందికి ఆరాధ్యదైవమైన శివుని శివలింగంపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్..

Kedarnath Temple: కేదార్‌నాథ్ గర్భగుడిలో అపచారం.. శివలింగంపై నోట్లను చల్లిన మహిళ.. వైరల్ అవుతున్న వీడియో..
Viral Video Visuals; Kedarnath Temple

Updated on: Jun 19, 2023 | 8:00 PM

Kedarnath Temple: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఓ మహిళ అపచారానికి పాల్పడింది. కోట్లాది మందికి ఆరాధ్యదైవమైన శివుని శివలింగంపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మరోవైపు కేదార్‌నాథ్ ఆలయ అధికారులు వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అసలు ఆ మహిళ ఎవరనేది ఇంకా తెలియరాలేదు.

వైరల్ అవుతున్న వీడియోలో చూడడానికి సాధువులా తెల్ల చీర, మెడలో రుద్రాక్షలు ధరించిన ఓ మహిళ కేదార్‌నాథ్ గర్భగుడిలోని శివలింగంపై నోట్లను కురిపిండాన్ని గమనించవచ్చు. ఇంకా ఇంత జరుగుతున్నా అక్కడ ఉన్నవారు ఆమెను వారించకపోవడాన్ని కూడా చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

కాగా, వైరల్ అవుతున్న వీడియో మూలాలను గుర్తించి, సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఆలయ అధ్యక్షుడు కోరారు. ఈ మేరకు అధికారికి ప్రకటనను విడుదల చేశారు. ఇంకా స్థానిక రుద్రప్రయాగ్‌ జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ‘ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నిషేధం ఉన్నప్పటికీ అక్కడకు కెమెరా ఎలా వచ్చింది..? అధికారులు నిద్రపోతున్నారా..?’ అంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..