కాలిపై పుట్టిన కురుపు పగిలి బయటకు వచ్చిన బుల్లెట్.. యువతి పరేషాన్!
20 ఏళ్ల క్రితం స్కూళ్లో 6వ తరగతి పరీక్షలు రాస్తుండగా ఓ బాలిక కాలికి ఏదో రాయి బలంగా తగిలింది. దీంతో కుటుంబ సభ్యులు గాయానికి కట్టుకట్టి కొన్ని రోజులు చికిత్స అందించారు. ఆ తర్వాత గాయం మానింది. అయితే ఇది జరిగిన 20 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే ప్రాంతంలో కురుపు వచ్చింది. ఇటీవల ఆ కురుపు పగటడంతో అందులో నుంచి బుల్లెట్ బయటకు రావడం చూసి అందరూ షాకయ్యారు. ఈ విచిత్ర ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఫరీదాబాద్, జనవరి 7: దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఓ బాలిక స్కూల్ గ్రౌండ్‌లో ఆడుకుంటూ ఉండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ బుల్లెట్ దూసుకొచ్చి.. ఆమె కాలి తొడలోకి దూసుకుపోయింది. అయితే ఏదో రాయి బలంగా తగిలినట్లు భావించిన బాలిక కుటుంబ సభ్యులు గాయానికి కట్టుకట్టి కొన్ని రోజులు చికిత్స అందించారు. ఆ తర్వాత గాయం మానింది. అయితే ఇది జరిగిన 20 ఏళ్ల తర్వాత సరిగ్గా అదే ప్రాంతంలో కురుపు వచ్చింది. ఇటీవల ఆ కురుపు పగటడంతో అందులో నుంచి బుల్లెట్ బయటకు రావడం చూసి అందరూ షాకయ్యారు. ఈ విచిత్ర ఘటన హరియాణాలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన కవిత (32)కాలి తొడ భాగం నుంచి ఎటువంటి సర్జరీ లేకుండానే 20 ఏళ్ల క్రితం తగిలిన తుపాకీ బుల్లెట్ బయటకు రావడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింద. ఇటీవల ఆమెకు తొడ భాగంలో కురుపు వచ్చింది. అది తాజాగా పగిలడంతో అందులో నుంచి ఏకంగా బుల్లోట్ రావడం చూసి షాకైంది. నిజానికి.. కవితకు 12 ఏళ్ల వయసప్పుడు అంటే 2005లో మనేసర్‌లోని కోటా ఖండేవాలా అనే గ్రామంలోని స్కూల్‌లో 6వ తరగతి పరీక్షలు రాస్తున్న సమయంలో ఏదో పదునైన వస్తువు వచ్చి ఆమె కాలి తొడ భాగంలో తగిలింది. తీవ్రంగా రక్తం కారడంతో ఏదో రాయి తగిలిందని భావించి టీచర్లు ఆమెను ఇంటికి పంపారు. తల్లిదండ్రులు గాయానికి కట్టుకట్టారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గాయం మానిపోయింది. ఆ తర్వాత ఆమె తొడ భాగంలో నొప్పిగానీ, వాపుగానీ ఏ ఇబ్బందులు తలెత్తలేదు. వివాహం ముందు వరకు కూడా నుహ్‌లోని టౌరులోని కోట ఖండేవాలా గ్రామంలోనే కవిత నివసించింది. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఆమె చదువుకుంది.
ప్రస్తుతం ఫరీదాబాద్‌లోని దబువా కాలనీలో ఉంటున్న ఆమెకు 2 నెలల క్రితం సరిగ్గా అదే ప్రదేశంలో కురుపు వచ్చింది. అది పెద్దదై పగలడంతో అందులో నుంచి బుల్లెట్ బయటకు వచ్చింది. నిజానికి ఆమె చిన్న తనంలో చదువుకున్నకోటా ఖండేవాలా గ్రామం పాఠశాల సమీపంలో సాయుధ దళ కాల్పుల శిక్షణ కేంద్రం ఉంది. ఆ సైనిక శిక్షణ శిబిరం నుంచే బుల్లెట్ దూసుకొచ్చి తనకు తగిలి ఉండవచ్చని భావిస్తున్నారు. బుల్లెట్ బయటకు వచ్చిన తర్వాత నొప్పి తగ్గిందని ఆమె తెలిపారు. బుల్లెట్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ లాగా ఉందని, ఇన్‌ఫెక్షన్ కాకుండా డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చాడని కవిత భర్త ప్రదీప్ సింగ్ (37) తెలిపాడు. బుల్లెట్ కవితకు తగిలినప్పుడు అది కండరాలలో ఇరుక్కుపోయి ఉంటుందని, వయస్సు పెరగడం వల్ల గాయం మానిపోయింది. కానీ శరీర రక్షణ యంత్రాంగంగా బుల్లెట్ చుట్టూ ఏర్పడిన కణజాలాల రక్షణ కవచం చీలిపోయి, ఇన్ఫెక్షన్‌కు దారితీసిందని ఆమెకు వైద్యం చేసిన ఫరీదాబాద్‌లోని బాద్షా ఖాన్ సివిల్ హాస్పిటల్ డాక్టర్ ఉపేంద్ర భరద్వాజ్ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




