థానే: అందరూ చూస్తుండగానే సివిల్ ఇంజనీర్ చెంప పగులగొట్టిందో మహిళా ఎమ్మెల్యే. అక్రమ కట్టడాల కూల్చివేత విషయమై ఇంజనీర్‌పై ఎమ్మెల్యే చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర థానే జిల్లా పరిధిలోని కాశిమీరాలోని పెంకర్‌పాడ ప్రాంతంలో వర్షాకాలానికి ముందు ఆక్రమణ నిరోధక స్క్వాడ్ కూల్చివేత డ్రైవ్‌ను చేపడుతున్నారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణంగా గుర్తించిన ఓ ఇంటిని ఇద్దరు ఇంజనీర్లు కూల్చివేశారు. ఈ విషయమై మీరా భయందర్ జిల్లా ఎమ్మెల్యే గీతా జైన్ ఇంజనీర్లను ప్రశ్నించారు. నివాస నిర్మాణాలను ఇంజనీర్లు ఎలా ధ్వంసం చేస్తారని జైన్ ప్రశ్నించారు.
వర్షాకాలానికి ముందు ఆ ఇంటిని కూల్చివేయండం వల్ల బాధిత మహిళ కుటుంబం రోడ్డున పడిందన్నారు. వర్షాకాలంలో నివాస నిర్మాణాలను కూల్చివేతను నిషేధించే ప్రభుత్వ తీర్మానం (GR) గురించి వారికి గుర్తు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఎమ్మెల్యే జైన్ ఇద్దరు ఇంజనీర్లను తిట్టడం కనిపిస్తుంది. అనంతరం ఆమె ఇంజనీర్ చొక్కా పట్టుకుని అతని చెంపపై కొట్టడం కనిపిస్తుంది. సదరు జూనియర్ ఇంజినీర్ మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంబీఎంసీ) కార్పొరేషన్‌లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నాడు.
आमदार गीता जैन ताई ही कुठली पद्धत आहे अधिकाऱ्यावर हात उचलून प्रश्न सोडवण्याची.अधिकारी चुकला असेल तर सरकार मधे आहात कायदेशीर कार्यवाही करा कायदा हातात घेण्याचा अधिकार तुम्हाला कोणी दिला आहे ? @CMOMaharashtra यांच्यावर कार्यवाही करणार की आमदारांना कायदा हातात घेण्याची सूट आहे ? pic.twitter.com/ndJGyhLVyR
— Suraj Chavan (सूरज चव्हाण) (@surajvchavan) June 20, 2023
వీడియో వైరల్‌గా మారడంతో ఎమ్మెల్యే దీనిపై స్పందించారు.. ‘జూనియర్ సివిల్ ఇంజనీర్లు ధ్వంసం చేసిన ఇంటిలో కొంత భాగం మాత్రమే అక్రమ నిర్మాణం కిందకు వస్తుంది. ఐతే వాళ్లు పూర్తి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంజనీర్లు మహిళ ఇంటిని కూల్చివేయడంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది. ఒక మహిళను అవమానించడాన్ని నేను సహించలేకపోయాను. నేను చేసిన పనికి పశ్చాత్తాపం చెందడం లేదు. దాని పరిణామాలకు నేను సిద్ధంగా ఉన్నాననంటూ’ బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. అంతేకాకుండా ఇంటిని కూల్చివేయవద్దని మహిళ వేడుకోగా ఆమె జుట్టుపట్టి బయటికి లాగారని ఆరోపించారు. కాగా బీజేపీ మాజీ మేయర్ అయిన జైన్ 2019 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఈ ఘటనపై మంగళవారం (జూన్ 20) సాయంత్రం వరకు ఎక్కడా పోలీస్ కేసు నమోదు కాలేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.