Indo China Border: నేను ఈ జన్మలో పార్వతిని.. శివయ్యను పెళ్లి చేసుకుంటా.. హిమాలయ వద్ద ఓ యువతి హల్ చల్

|

Jun 04, 2022 | 4:08 PM

ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని నాభిధాంగ్‌లోని నిషేధిత ప్రాంతంలో చట్టవిరుద్ధంగా లక్నోకు చెందిన హర్మీందర్ కౌర్‌ అనే మహిళ నివసిస్తుంది. అంతేకాదు తాను పార్వతీ దేవి అవతారమని.. కైలాస పర్వతంపై నివసించే శివుడిని వివాహం చేసుకుంటానని పేర్కొంటూ ఆ ప్రాంతం నుంచి విడిచిరావడానికి నిరాకరించింది.

Indo China Border: నేను ఈ జన్మలో పార్వతిని.. శివయ్యను పెళ్లి చేసుకుంటా.. హిమాలయ వద్ద ఓ యువతి హల్ చల్
Woman Illegally Resides At
Follow us on

Indo China Border: భారతదేశం-చైనా సరిహద్దులో నివసిస్తున్న మహిళ తాను పార్వతీ దేవిని(Goddess Parvati) అని చెప్పుకుని, శివుడిని(God Shiva) పెళ్లి చేసుకోవాలను కుంటోంది. నిషేధిత ప్రాంతం నుంచి ఆ మహిళను తీసుకుని వచ్చేందుకు వెళ్లిన పోలీసు బృందాన్ని ఆమె అడ్డుకుంది. అంతేకాదు తనను ఆ ప్రాంతం నుంచి తీసుకుని వెళ్ళితే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని నాభిధాంగ్‌లోని నిషేధిత ప్రాంతంలో చట్టవిరుద్ధంగా లక్నోకు చెందిన హర్మీందర్ కౌర్‌ అనే మహిళ నివసిస్తుంది. అంతేకాదు తాను పార్వతీ దేవి అవతారమని.. కైలాస పర్వతంపై నివసించే శివుడిని వివాహం చేసుకుంటానని పేర్కొంటూ ఆ ప్రాంతం నుంచి విడిచిరావడానికి నిరాకరించింది. తాము ఆ నిషేధిత ప్రాంతం నుండి హర్మీందర్ కౌర్‌ను తీసుకుని రావడానికి పోలీసు బృందంతో వెళ్లినట్లు  పితోర్‌గఢ్ ఎస్పీ లోకేంద్ర సింగ్ చెప్పారు. అయితే తనను అక్కడ నుంచి తీసుకుని వెళ్తే.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో నిరాశతో తాము తిరిగి రావాల్సి వచ్చిందని ఎస్పీ లోకేంద్ర సింగ్ తెలిపారు. అయితే ఆమెను సురక్షితంగా బలవంతంగానైనా అక్కడ నుంచి తీసుకుని రావడానికి పెద్ద బృందాన్ని పంపాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

“ఉత్తరప్రదేశ్‌లోని అలీగంజ్ ప్రాంతానికి చెందిన హర్మీందర్ కౌర్‌..  అన్ని అనుమతులతోనే 15 రోజుల పాటు తల్లితో కలిసి హిమాలయాల్లోని గుంజీ ప్రాంతానికి  వెళ్లిందని చెప్పారు. అయితే ఆమె అనుమతి గడువు మే 25న ముగిసిన తర్వాత కూడా నిషేధిత ప్రాంతం నుండి వెళ్లేందుకు నిరాకరించింది” అని SP తెలిపారు.

ఇవి కూడా చదవండి

నిషేధిత ప్రాంతం నుండి మహిళను తీసుకురావడానికి ఇద్దరు సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఒక ఇన్‌స్పెక్టర్‌తో కూడిన ముగ్గురు సభ్యుల పోలీసు బృందాన్ని ధార్చుల నుండి పంపామని అయితే ఖాళీ చేతులతో తిరిగి రావాల్సి వచ్చిందని పోలీసు అధికారి తెలిపారు.

“మేము ఇప్పుడు మహిళను తిరిగి తీసుకురావడానికి వైద్య సిబ్బందితో సహా 12 మంది సభ్యులతో కూడిన పెద్ద పోలీసు బృందాన్ని పంపించాలని ప్లాన్ చేసాము” అని అతను చెప్పారు. తాను పార్వతీ దేవి అవతారమని, శివుడిని పెళ్లాడేందుకు వచ్చానని చెప్పుకోవడం వల్ల ఆ స్త్రీ మానసికంగా స్థిరంగా లేదని తాము భావిస్తున్నట్లు ఎస్పీ లోకేంద్ర సింగ్ చెప్పారు. గుంజి కైలాష్-మానససరోవర్ మార్గంలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..