Actor Suresh Gopi: ప్రముఖ నటుడు సురేష్‌ గోపికి భారీ ఊరట.. ముందస్తు బెయిల్‌కు హైకోర్టు ఓకే

|

Jan 08, 2024 | 5:44 PM

ప్రముఖ మలయాళ సినీ నటుడు, మాజీ ఎంపీ సురేష్ గోపీకి కేరళ హైకోర్టు సోమవారం (జనవరి 8) ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. కోజికోడ్‌లో ప్రెస్ ఇంటరాక్షన్ సందర్భంగా మహిళా జర్నలిస్టును అనుచితంగా తాకారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్‌ కోఎసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై నేడు విచారణ జరిపిన కేరళ హైకోర్టు సురేష్ గోపికి..

Actor Suresh Gopi: ప్రముఖ నటుడు సురేష్‌ గోపికి భారీ ఊరట.. ముందస్తు బెయిల్‌కు హైకోర్టు ఓకే
Actor Suresh Gopi
Follow us on

కొచ్చి, జనవరి 8: ప్రముఖ మలయాళ సినీ నటుడు, మాజీ ఎంపీ సురేష్ గోపీకి కేరళ హైకోర్టు సోమవారం (జనవరి 8) ముందస్తు మెయిల్ మంజూరు చేసింది. కోజికోడ్‌లో ప్రెస్ ఇంటరాక్షన్ సందర్భంగా మహిళా జర్నలిస్టును అనుచితంగా తాకారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ముందస్తు బెయిల్‌ కోఎసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై నేడు విచారణ జరిపిన కేరళ హైకోర్టు సురేష్ గోపికి బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేస్తే బెయిల్‌పై విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అయితే ముందుగా రూ. 25,000 బాండ్, రెండు సాల్వెంట్ ష్యూరిటీలను సమర్పించిన తర్వాత మాత్రమే సురేష్‌ను బెయిల్‌పై విడుదల చేయాలని కోర్టు సూచించింది. ప్రస్తుతం అరెస్ట్ చేసే పరిస్థితి లేదని సురేష్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణకు జనవరి 24న కోర్టు ముందు హాజరుకావాలని జస్టిస్ సోఫీ థామస్ ఆయనను ఆదేశించారు.

కాగా సురేష్ గోపీ తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ మహిళా జర్నలిస్టు మహిళా జర్నలిస్ట్ అక్టోబర్ 28న కోజికోడ్ సిటీ కమీషనర్, మహిళా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. సురేష్ గోపీ మీడియా ప్రసంగంలో రెండుసార్లు తన చేతిని దూరంగా నెట్టినా కూడా కావాలని ఆమె భుజంపై చేయి వేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్ 354 (ఒక మహిళపై దాడి చేయడం లేదా ఆమెను కించపరిచే ఉద్దేశ్యంతో ఆమెపై నేరారోపణలు చేయడం) కింద సురేస్‌ గోపీపై కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఆయనను ఈ రోజు కోర్టు విచారణకు హాజరుపరిచారు.

ఈ కేసు రాజకీయ ప్రేరేపితమని, కరువనూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో డిపాజిటర్ల కేసుకు ప్రతీకారంగా తనను ఈ కేసులో ఇరికించారని, ఈ కేసుతో పాటు తనపై మరో పన్ను ఎగవేత కేసును కూడా నమోదు చేశారని సురేష్‌ గోపీ తన ముందస్తు బెయిల్ దరఖాస్తులో పేర్కొన్నారు. ఓ ఈవెంట్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళా జర్నలిస్ట్‌తో సహా పత్రికా సిబ్బంది తనను కొట్టారని బెయిల్‌ దరఖాస్తులో తెలిపారు. మహిళా జర్నలిస్టును తాను ఉద్ధేశ్యపూర్వకంగా తాకలేదని, తన దారికి అడ్డుగా ఉన్నందున అక్కడే ఉన్న పలువురు పత్రికా సిబ్బందిని దాటుకుని వెళ్లేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు సమన్లు పంపిన రోజున పోలీసుల ఎదుట హాజరయ్యానని, అన్ని విధాలా సహకరించానని తెలిపారు. ఈ రోజు జరిగిన విచారణలో మహిళా జర్నలిస్టుకు బెయిల్ మంజూరుపై ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టు తెలియజేసింది. సురేష్‌ గోపీని కస్టడీలో ఉంచడం అనవసరమని కోర్టు అభిప్రాయపడింది. అందువల్లనే ఆయన ముందస్తు బెయిల్ అభ్యర్థనను అనుమతించినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.