అదనపు కట్నం వేధింపులతో దారుణం.. కిరాతకంగా చంపేసి.. మృతదేహాన్ని తగలెట్టేశారు

|

Jun 09, 2022 | 9:29 PM

సమాజానికి జాఢ్యంగా దాపురించిన వరకట్నం నిండు జీవితాన్ని బుగ్గి చేస్తోంది. అదనపు కట్న(Additional Dowry) దాహానికి ఎంతో మంది మహిళలు బలవుతూనే ఉన్నారు. వరకట్నం తీసుకోవడం నేరమని, కట్నం తేవాలంటూ...

అదనపు కట్నం వేధింపులతో దారుణం.. కిరాతకంగా చంపేసి.. మృతదేహాన్ని తగలెట్టేశారు
crime news
Follow us on

సమాజానికి జాఢ్యంగా దాపురించిన వరకట్నం నిండు జీవితాన్ని బుగ్గి చేస్తోంది. అదనపు కట్న(Additional Dowry) దాహానికి ఎంతో మంది మహిళలు బలవుతూనే ఉన్నారు. వరకట్నం తీసుకోవడం నేరమని, కట్నం తేవాలంటూ ఎలాంటి ఒత్తిడి చేయకూడదని ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. పెళ్లయ్యేంత వరకు బాగానే ఉంటూ.. పెళ్లయ్యాక అసలు రూపాన్ని బయటపెడుతున్నారు. అదనపు కట్నం కావాలంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. కొన్ని సార్లు ఆ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటుండగా.. మరికొన్ని ఘటనల్లో మాత్రం దారుణ హత్య కు గురవుతున్నారు. తాజాగా బిహార్(Bihar) లో ఇలాంటి ఘటనే జరిగింది. మహిళపై అత్తింటివారు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అంతేకాకుండా మృతదేహాన్ని తగలబెట్టారు. ఈ ఘటనలో మృతదేహం 90శాతం కాలిపోయింది. బిహార్ లోని భోజ్ పుర్ జిల్లాలోని బరౌలీలో నివాసముండే శత్రుఘ్న బింద్​కు బభన్​గామా గ్రామానికి చెందిన మమతా దేవితో వివాహమైంది. 2021 మేలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లి సమయంలో వధువు బంధువులు వరుడికి కొంత కట్నం ఇచ్చారు.

కొద్ది రోజులు బాగానే సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి. వ్యాపారం చేసేందుకు రూ.2 లక్షలు అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటివారు వేధింపులకు గురి చేయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లిదండ్రులకు చెప్పింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా వారూ ఏమీ చేయలేకపోయారు. దీంతో తీవ్ర కోపంతో మమతను అత్తింటివారు దారుణంగా హత్య చేశారు. ఆధారాలు లేకుండా చేసేందుకు మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేయాలనుకున్నారు. దీనికోసం ఓ కారును అద్దెకు తీసుకుని సరిపుర్​విశ్వన్​పుర్​ గ్రామం సమీపంలో నది ఒడ్డున పూడ్చేశారు. అయినప్పటికీ అనుమానం వస్తుందన్న కారణంతో మృతదేహాన్ని బయటకు తీసి కాల్చేశారు.

ఈ ఘటనను కొందరు గ్రామస్థులు గమనించారు. మృతురాలి అత్తింటివారిని నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ముఫాసిల్ పోలీసులతో కలిసి వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే.. 90 శాతం మేర మృతదేహం కాలిపోయింది. బాధితురాలి భర్త శత్రుఘ్న బింద్, మామ రామ్​ ప్యార్​ బింద్​పై ముఫాసిల్​ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేశారు. ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి